‌దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ

  • రికార్డు స్థాయిలో 153 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి సాగు
  • రైతుల మేలు కోసం ఏ పథకమైనా తీసుకొస్తాం..
  • రూ500 బోనస్‌ ‌తో రైతుల్లో ఆనందం
  • మహబూబ్‌ ‌నగర్‌  ‌రైతు పండుగలో మంత్రులు ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు

మహబూబ్‌నగర్‌ ‌ప్రజాతంత్ర నవంబర్‌ 29 : ‌భారత్‌ ‌లో ఏ రాష్ట్రంలో పండని విధంగా ఈ వానాకాలంలో తెలంగాణ రాష్ట్రంలో 66.7లక్షల ఎకరాల్లో 153 లక్షల మెట్రిక్‌ ‌టన్నుల వరి ధాన్యం పండిందని.. దీంతో దేశంలోనే ధాన్య భాండాగారంగా తెలంగాణ రాష్ట్రానికి  గుర్తింపు వొచ్చిందని . ఇది అతిపెద్ద రికార్డు అని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతున్న సందర్భంగా ప్రజా పాలన విజయోత్సవాల్లో  భాగంగా మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో ఏర్పాటు చేసిన మూడు రోజుల రైతు పండగ, నవంబర్‌ 30‌న రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పరిశీలించడానికి శుక్రవారం మంత్రి ఉత్తమ్‌ ‌కుమార్‌ ‌రెడ్డి వొచ్చారు.

స్టాళ్లను పరిశీలన అనంతరం నీటి పారుదల శాఖ మంత్రి రైతు అవగాహన సదస్సులో మాట్లాడారు. దేశంలోనే అత్యధికంగా వరి సాగు చేసి దేశంలో మొదటి స్థానం సాధించిందన్నారు. అందుకే రైతులు పండగ చేసుకుంటున్నారని చెప్పారు. రైతులకు మంచి పంటలు పండాయని ప్రభుత్వం సైతం దొడ్డు రకానికి మద్దతు ధరకు కొనుగోలు చేసి, సన్న రకం వరికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇస్తున్నామని తెలిపారు రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొంటుందని భరోసా ఇచ్చారు. రైతు పండగ ఏర్పాట్లు, స్టాళ్లు చాలా అద్భుతంగా ఉన్నాయని ఇందుకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అనుభవం, ఆయన దక్షత కారణమని కొనియాడారు.

రాష్ట్ర పరిస్థితులు ఎలా ఉన్నా ప్రభుత్వం పూర్తిగా రైతు పక్షపాతి అని అన్నారు. గత పాలకులు రుణమాఫీ చేస్తామని చెప్పి మొదటి ఐదేళ్లలో కేవలం వడ్డీ మాత్రమే మాఫీ చేసిందని, తర్వాత అరకొర రుణమాఫీ చేసి చేతులెత్తేసిందని  అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం 18 వేల కోట్లతో 21 లక్షల మంది రైతుల రుణమాఫీ చేశామని చెప్పారు. మిగిలిన కొంత మంది రైతుల రుణమాఫీపై ముఖ్యమంత్రి ఒక ప్రకటన చేస్తారని తెలిపారు.

రైతుల సూచనలు వినేందుకే రైతు పండుగ
రైతులకు అండగా ఉండేందుకు.. ఏది  మంచిదో రైతులే చెప్పాలని, మీ సలహాలు సూచనలు వినడానికే ఈ రైతు సదస్సును ఏర్పాటు చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రైతుల అభిప్రాయం మేరకు వారికి మేలు చేసే పథకాలనే కొనసాగిస్తామన్నారు.  రైతులు పామాయిల్‌ ‌సాగు చేయాలని 4 సంవత్సరాలు పెట్టుబడి ప్రభుత్వమే భరిస్తుందని, ఈ నాలుగేళ్ల  అంతర పంట సాగు చేసి అత్యధిక లాభాలు పొందవచ్చన్నారు. మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాలో రెండు పామాయిల్‌ ‌మిల్లులు ఏర్పాటు చేస్తామని, పామాయిల్‌ ‌పంటను రైతు ఇంటి వద్దనే కొంటామని రైతులకు పామాయిల్‌ ‌సాగుపై భరోసా కల్పించారు.

వలస జిల్లాగా పేరు పడిన మహబూబ్‌ ‌నగర్‌ ‌జిల్లాకు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు చాలా ముఖ్యమైనదని దీనికి అత్యంత ప్రాధాన్యమిచ్చి  త్వరగా పూర్తి చేయించాలని సభా ముఖంగా నీటిపారుదల శాఖ మంత్రిని విజ్ఞప్తి చేశారు.  ఎండాకాలం పంట మార్చి లోపల కోతలు ప్రారంభిస్తేనే నూకలు తక్కువ అవుతాయని లేకుంటే బియ్యం నూకల శాతం అధికంగా ఉంటుందన్నారు. అందువల్ల ఎండాకాలం పంటకు నీరు ఎప్పుడూ విడుదల చేస్తారో త్వరగా నిర్ణయం తీసుకోవాలని సహచర మంత్రిని కోరారు.

కార్యక్రమంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్‌ ‌జి.చిన్నా రెడ్డి,  దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్‌ ‌రెడ్డి, మహబూబ్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ ‌రెడ్డి, షాద్‌ ‌నగర్‌ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌, ‌వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి, మక్తల్‌ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, అచ్చంపేట ఎమ్మెల్యే డా. వంశీక్రిష్ణ, నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి, రాష్ట్ర రైతు సంఘాల అధ్యక్షుడు కోదండ రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్‌  ‌సెక్రటరీ రఘునందన్‌ ‌రావు, కమిషనర్‌ ‌గోపి,  రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ ‌డి.ఎస్‌. ‌చౌహాన్‌, ‌జిల్లా కలెక్టర్‌ ‌విజయేంద్ర బోయి, శాస్త్రవేత్తలు, రైతులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page