ఆర్మూర్ సొసైటీకి తాళం

– ధాన్యం తరలించకపోవడంపై రైతుల నిరసన

నిజామాబాద్, ప్రజాతంత్ర, మే 11 : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ సొసైటీ పరిధిలోని రాంపూర్ గ్రామంలో నెల రోజులుగా ధాన్యం కోసి కల్లాల్లో వేసి తూకం చేసిన కూడా లారీల కొరతతో ఎక్కడి ధాన్యం అక్కడే ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాంపూర్ గ్రామస్తులు ఆర్మూర్ సొసైటీకి సోమవారం తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు. సొసైటీ నిర్వాహకులు లారీ యజమానులతో కుమ్మక్కై లారీలను తమ గ్రామానికి పంపడం లేదని, మిగతా గ్రామాలకు ప్రతి రోజూ ఒకటి రెండు లారీలను పంపుతూ ధాన్యం సేకరిస్తున్నారని, తమ గ్రామంపై వివక్ష ఎందుకు చూపిస్తున్నారని సొసైటీ చైర్మన్‌ను నిలదీశారు. ధాన్యం రోజులతరబడి కల్లాల్లో ఉండడం వల్ల క్వింటాకు 10 కిలోల వరకు తరుగు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. లారీలను పంపి కొరతను తీరుస్తానని నిర్వాహకులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు శాంతించి రెండు రోజులలో లారీలను తీసుకొని రాకుంటే ఆర్మూర్ అంబేడ్క‌ర్ చౌరస్తా వద్ద గ్రామస్తులం ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *