– మహిళ మృతి, బాలుడికి తీవ్ర గాయాలు
హైదరాబాద్,ప్రజాతంత్ర,జూన్ 6: ఖైరతాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆనంద్ నగర్ కాలనీలో ఉన్న భావన అపార్ట్‌మెంట్స్‌లో లిప్ట్ ప్రమాదంలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ఆమెతో ఉన్న మనవడు గాయపడ్డాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్ ఆనంద్ నగర్ కాలనీలోని భావన అపార్ట్‌మెంట్స్ లో లిప్ట్‌లో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రాధ (58) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ప్రమాదం అపార్ట్‌మెంట్ 5వ అంతస్తులో జరిగింది. లిప్ట్ పూర్తిగా ఆ అంతస్తుకు చేరుకోకముందే బాధితురాలు తలుపు తెరిచింది. దీంతో ఆమె ఒక్కసారిగా లిప్ట్ గుంతలో పడిపోవడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందింది. ఆమెతో పాటు ఉన్న 13 నెలల మనవడు జియోల్ గాయపడటంతో వెంటనే సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. చిన్నారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటన అనంతరం అపార్ట్‌మెంట్ నివాసితులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.


