ఇసుక అక్రమ రవాణా నిరోధానికి చర్యలు

– అధికారులను ఆదేశించిన మంత్రి వివేక్‌

‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌6:  ‌రాష్ట్రంలో అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి సీరియస్‌ అయ్యారు.అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు నిఘా వ్యవస్థ బలోపేతం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. లారీల కదలికలపై నిరంతరం పర్యవేక్షించాలని హుకుం జారీ చేశారు. ఇసుక ఆదాయం పెంపుపై టీజీఎండీసీ అధికారులతో మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి శనివారం సచివాలయంలో సక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ఇసుక నిర్వహణలో పూర్తి పారదర్శకత పాటించాలని దిశానిర్దేశర చేశారు. అలాగే, సాండ్‌ ‌బజార్ల పనితీరుపై మంత్రి వివేక్ ‌సమీక్షా సమావేశం నిర్వహించారు. కీలక ఖనిజాల అన్వేషణ వేగవంతం చేయాలని ఆదేశించారు. ఖనిజ వనరుల సమర్థ నిర్వహణకు అమలు వ్యవస్థ పటిష్ఠం చేయాలని సూచించారు. అక్రమ మైనింగ్‌ ‌నియంత్రణ చర్యలను మంత్రికి.. టీజీఎండీసీ అధికారులు వివరించారు. రాష్ట్ర ఖనిజ రంగంలో ఆదాయ వృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టామని మంత్రి వివేక్‌ ‌వెంకటస్వామి పేర్కొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *