తెలంగాణ పునర్నిర్మాణానికి మళ్ళీ కొట్లాడదాం

– ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణకు సేవ చేస్తా
– కాంగ్రెస్ నాయకులపై కేసీఆర్ నిప్పులు
– జగిత్యాల ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఘాటు వ్యాఖ్యలు
– తెలంగాణ ఉద్యమ స్మృతులను గుర్తుచేసుకున్న గులాబీ బాస్
– మిషన్ భగీరథ నీళ్లు ఏమైనయ్? ప్రజలు ఎదురుతిరగాల్సిందే

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: “పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని కోరుకుంటున్నారు.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావను. నా ప్రాణం ఉన్నంత వరకు, తెలంగాణ ప్రజలు గ ర్వంగా తలెత్తుకుని బతికే వరకు విశ్రమించ ను” అని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్య మం త్రి కేసీఆర్ స్పష్టం చేశారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ‘ప్రజా ఆశీర్వాద సభ’లో ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తన మరణం కోరుకుంటున్న వారికి ఒక కథ ద్వారా కేసీఆర్ కౌంటర్ ఇచ్చారు. “ఉ ట్టి మీద ఉన్న ఎండిపోయిన చేపలు అందక పిల్లి శాపాలు పెట్టినట్లు.. ఈ ఎదవలు కేసీఆర్ చావాలని శాపాలు పెడితే నేను చస్తానా? ప్ర జల దీవెనలు, ఆశీస్సులు ఉన్నంత వరకు నన్నె వరూ ఏమీ చేయలేరు” అని ధ్వజమెత్తారు. తనకు 72 ఏళ్లు వచ్చినా, తెలంగాణలో దరి ద్రం పోయే వరకు, ప్రజలంతా సంతోషంగా ఉండే వరకు సేవ చేస్తూనే ఉంటానని ప్రకటించారు.తెలంగాణ ఉద్యమ రోజులను గుర్తుచేసుకుం టూ.. హైదరాబాద్ సిటీలో మ నోళ్లకు ఉద్యోగాలు రావని తెలిసినప్పుడే తన లో తిక్కరేగిందని కేసీఆర్ అన్నారు. “సిద్దిపేట లో ఉద్యోగ గర్జన చేసి కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అని ఆమరణ దీక్షకు దిగాను. ఆనాడు దేశం మొత్తం అల్లకల్లోలమైతే కేంద్రం దిగొచ్చి తెలంగాణ ఇస్తామని ప్రక టించింది. ఆంధ్రోళ్ల రాజీనామాల డ్రామాలతో వెనక్కి వెళ్ళినా మళ్ళీ జేఏసీ పెట్టి భయంకరంగా కొట్లాడి రాష్ట్రాన్ని సాధించుకున్నాం అని వివరించారు.

మిషన్ భగీరథ నీళ్లు రావాలంటే కొట్లాడాలి

బీఆర్ఎస్ హయాంలో చేసిన అభివృద్ధిని కేసీఆర్ ఏకరువు పెట్టారు. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేసి భూగర్భ జలాలను పెంచాం. ఐదేళ్లలో మిషన్ భగీరథ పూర్తి చేసి ఇంటింటికీ నల్లా నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనని అసెంబ్లీలో సవాల్ చేసి మరీ నీళ్లిచ్చిన ఏకైక ముఖ్య మంత్రిని నేను.  పదేళ్లు నీళ్లు పుష్కలంగా వస్తే.. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఎందుకు రావడం లేదు? నీళ్లు రావాలంటే లాగులు పలిగేలా కొట్లాడాలి అని ప్రజలకు పిలుపునిచ్చారు.

జీవన్ రెడ్డిపై చమత్కారం 

75 ఏళ్లు వచ్చాయని జీవన్ రెడ్డి అన్న మాటలపై కేసీఆర్ స్పందిస్తూ వయసు పెరిగితే నడవలేరని అనుకోవద్దు. మీకు ఇప్పుడు  50 ఏళ్లే.. ఇంకా చెప్పాలంటే మీ వయసు 25 ఏళ్లు తగ్గిపోయింది. యువకుడిలా ఉత్సాహంతో ముందుకు సాగాలి అని చమత్కరించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం చివరి శ్వాస దాకా పోరాడుతానని కేసీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *