డీఎస్పీ నికత్ జరీన్‌కు డీజీపీ అభినందన

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: మంగోలియాలోని ఉలాన్‌బాటర్‌లో ఈనెల 2 నుంచి 12వ తేదీ వరకు జరిగిన ప్రతిష్టాత్మక బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకాన్ని సాధించిన డీఎస్పీ నిఖత్ జరీన్‌ను డీజీపీ బి.శివధర్ రెడ్డి సోమవారం తన కార్యాలయంలో అభినందించారు. అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరిచి రాష్ట్ర పోలీస్ శాఖ ప్రతిష్టను ఇనుమడింపజేసిన ఆమెను కొనియాడారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా, ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్, తెహ్రీ లేక్ వేదికగా ఈనెల 8 నుండి 12వ తేదీ వరకు నిర్వహించిన 25వ ఆల్ ఇండియా పోలీస్ వాటర్ స్పోర్ట్స్ క్లస్టర్  పోటీల్లోనూ తెలంగాణ పోలీసులు సత్తా చాటారు. రోయింగ్ కాక్స్‌లెస్ పెయిర్ – 500 మీటర్ల విభాగంలో 1వ బెటాలియన్ టీజీఎస్పీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ ఎన్.రామకృష్ణ, సీఏఆర్ సిద్దిపేటకు చెందిన పోలీస్ కానిస్టేబుల్ జె.రాజు అద్భుత ప్రతిభను కనబరిచి రజత పతకాన్ని కైవసం చేసుకున్నారు. వీరిని కూడా డీజీపీ అభినందించారు. ఈ కార్యక్రమంలో శాంతిభద్రతల అదరపు డీజీపీ మహేష్ ఎం భగవత్, స్పోర్ట్స్ ఐజీపీ గజరావు భూపాల్, స్పోర్ట్స్ ఆఫీసర్ ఆర్వీ రామారావు, కోచ్ పి.కృష్ణారావు (హెడ్ కానిస్టేబుల్, డీఏఆర్ వనపర్తి) తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *