– 22,23 తేదీల్లో దిల్లీలోనే ఉంటానన్న సీఎం
– వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేద్దాం
– కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20: హైదరాబాద్ మెట్రో రైలు రెండోదశ పొడిగింపు అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో బహిరంగ లేఖ రాశారు. మెట్రో పెండింగ్ అంశాల పరిష్కారానికి జోక్యం చేసుకోవాలని కిషన్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ఫేజ్-2, ఎల్ అండ్ టి ఫైనాన్సింగ్‌పై చర్చకు సమావేశం ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రికి సీఎం విజ్ఞప్తి చేశారు. జూన్ 22, 23 తేదీల్లో తాను ఢిల్లీలో ఉంటానని, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో భేటీకి సమయం కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. ఇద్దరం కలిసి రైల్వే మంత్రిని కలుద్దామని ప్రతిపాదించారు. సంబంధిత ఒప్పందాల పత్రాలతో సమావేశానికి హాజరవుతానని ముఖ్యమంత్రి తెలిపారు. హైదరాబాద్‌కి మెట్రో కీలక మౌలిక వసతి ప్రాజెక్టని, దీనికి సంబంధించిన పెండింగ్ అంశాలకు త్వరితగతిన పరిష్కారం అవసరమని లేఖలో సీఎం పేర్కొన్నారు. కాగా, ఈనెల 16న కూడా మెట్రో రైలు అంశంపై కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి లేఖ రాశారు. ఈ సందర్భంగా సమస్య పరిష్కారానికి ఏ టింగ్‌కైనా తాను సిద్ధమేనని సీఎం రేవంత్ అన్నారు. రైల్వే మంత్రితో వీలైనంత త్వరగా సమావేశం ఏర్పాటు చేయించాలన్నారు. కిషన్ రెడ్డి పిలుపు కోసం తాను ఎదురు చూస్తానని పేర్కొన్నారు. ఇందుకు ఆయనతో వ్యక్తిగత భేటీకీ సిద్ధమేనని అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.