బండి భగీరథ్‌కు తాత్కాలిక ఉపశమనం

– వారంపాటు బెయిల్‌ ‌మంజూరు

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, జూన్‌ 20:‌కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్‌ ‌నాయకుడు బండి సంజయ్‌ ‌కుమారుడు బండి భగీరథ్‌కు న్యాయస్థానంలో ఉపశమనం లభించింది. ఓ యువతిపై లైంగిక దాడి కేసులో అరెస్టై చంచల్‌గూడ జైల్లో రిమాండ్‌లో ఉన్న భగీరథ్‌కు మల్కాజ్‌గిరి కోర్టు షరతులతో కూడిన బెయిల్‌ ‌మంజూరు చేసింది. ఈ కేసులో గత కొన్ని రోజులుగా భగీరథ్‌ ‌జైలు జీవితం అనుభవిస్తున్నాడు. తాజాగా ఇంజనీరింగ్‌ ‌పరీక్షల నేపథ్యంలో న్యాయవాదులు మధ్యంతర బెయిల్‌ ‌కోరారు. వాదనల విన్న కోర్టు నెల 26 వరకు మధ్యంతర బెయిల్‌ ‌మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇదిలా ఉండగా గత నెలలో భగీరథ్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదైన విషయం తెలిసిందే.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *