– వర్ధంతి సందర్భంగా ఆయన్ను స్మరించుకున్న సీఎం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 20 : తెలంగాణ జాతిపిత, స్వరాష్ట్ర స్వాప్నికుడు ప్రొఫెసర్ కె.జయశంకర్ సార్ వర్థంతి సందర్భంగా ఆ మహనీయుడి త్యాగాన్ని, కృషిని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి స్మరించుకున్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధనే ఉచ్ఛ్వాసనిశ్వాసాలుగా ఆయన జీవితాన్ని గడిపారని గుర్తు చేసుకున్నారు. ఆ మహనీయుడి త్యాగాన్ని తెలంగాణ సమాజం, ప్రజా ప్రభుత్వం సదా గుర్తుంచుకుంటుందని తెలిపారు. ఆ మహనీయుడి ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తామని చెప్పారు. ఆయన ఆశయ సాధనకు కోసం ప్రజా ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేయడాన్ని జయశంకర్ సార్ వ్యతిరేకించారని తెలిపారు. ఏపీలో విలీనంతో జరిగిన అన్యాయాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తూ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ఆరు దశాబ్దాలు సజీవంగా ఉంచిన ఘనత ఆయనదేనని సీఎం కొనియాడారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




