– లెజిస్లేచర్ మైనారిటీల సంక్షేమ కమిటీ, ఎస్సీ సంక్షేమ కమిటీ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభ కమిటీలకు ఎంతో ప్రాధాన్యత ఉన్నదని, ప్రభుత్వ శాఖల పనితీరును సమీక్షిస్తూ ప్రజలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా చేరేలా చూడడంలో కమిటీలు కీలక పాత్ర పోషిస్తాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. శాసనసభ భవనంలోని స్పీకర్ ఛాంబర్‌లో శాసనమండలి(లెజిస్లేచర్) మైనారిటీల సంక్షేమ కమిటీ, షెడ్యూల్డ్ కులాల సంక్షేమ కమిటీ ప్రారంభ సమావేశం సోమవారం జరిగింది. తొలుత నూతన కమిటీ చైర్మన్లకు, సభ్యులకు చైర్మన్, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, కార్యదర్శులు పుష్పగుచ్ఛాలతో అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై కమిటీలు నిత్యం పర్యవేక్షిస్తూ ప్రభుత్వానికి సలహాలు సూచనలు అందించాలన్నారు. మైనారిటీల విద్య, ఉపాధి, ఆరోగ్యం, సామాజిక సంక్షేమం వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించి వారికి అందుతున్న ప్రభుత్వ పథకాలు, నిజమైన ప్రయోజనాలను అందించేలా చూడాల్సిన బాధ్యత ఈ కమిటీపై ఉన్నదని అన్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలతోపాటు అధికారుల ద్వారా తగు సమాచారాన్ని తెప్పించుకుని షెడ్యూý్డÙ కులాలకు సంబంధించిన పథకాల మలులో లోటుపాట్లను సమీక్షించి ప్రభుత్వానికి తగు సూచనలు చేయాలని సూచించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు అనుగుణంగా ఖర్చుపై సమగ్రంగా వివరణలను తీసుకోవాలన్నారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ తాను కూడా 2008లో షెడ్యూల్డ్ కులాల కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించానని గుర్తు చేసుకున్నారు. రాష్ట్ర జనాభాలో 18 శాతం ఉన్న షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి, సంక్షేమం కోసం ఈ కమిటీ పనిచేస్తూ వారి ప్రాథమిక అవసరాలను గుర్తించి అందుకు అవసరమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. కమిటీ సభ్యులు తమ అనుభవం, అవగాహనతో అధికారులతో సమన్వయంతో పనిచేసి ప్రజాప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి, మైనారిటీలు, వెనుకబడిన తరగతుల అభివృద్ధికి కృషి చేస్తారని ఆశిస్తున్నానన్నారు. మండలి డిప్యూటీ చైర్మన్ డాక్టర్ బండా ప్రకాష్, లెజిస్లేచర్ మైనారిటీస్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ తోట లక్ష్మీకాంతారావు, సభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, కాలేరు వెంకటేష్, పాయల్ శంకర్, శాసనమండలి ఎస్‌సీ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ మేడిపల్లి సత్యం, సభ్యులు వెడ్మ బొజ్జు, కేఆర్ నాగరాజు, కవ్వంపల్లి సత్యనారాయణ, విజయుడు, శ్రీపాల్ రెడ్డి, బస్వరాజు సారయ్య, మండలి కార్యదర్శి డాక్టర్ వి.నరసింహాచార్యులు, శాసనసభ కార్యదర్శి రేండ్ల తిరుపతిలు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





