– టీజీహెచ్‌ఆర్‌సీ ఆదేశాలు
హైదరాబాద్, ప్రజాంత్ర, ఆగస్టు 24 : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, తరగతి గదులు, మరుగుదొడ్లు తదితర ప్రాథమిక సౌకర్యాలపై హెచఆర్‌సీ నెం.2638 ఆఫ్ 2026 తేదీ 3.8.2026న చైర్‌పర్సన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్(టీజీహెచ్‌ఆర్‌సీ) కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో తగిన తరగతి గదులు, మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు లేకపోవడంతో విద్యార్థులు చెట్ల కింద, వరండాల్లో, కమ్యూనిటీ భవనాల్లో తరగతులకు హాజరవుతున్నారంటూ జూలై 3న ఒక దినపత్రికలో ప్రచురితమైన వార్త ఆధారంగా కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించింది. కమిషన్ ఆదేశాల మేరకు ఆదిలాబాద్, జనగాం, నల్గొండ, సూర్యాపేట జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారుaఱ నివేదికలు సమర్పించారు. వాటిని పరిశీలించగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో శిథిలావస్థలో ఉన్న తరగతి గదులు, మరమ్మతులు అవసరమైన తరగతి గదులు, మరుగుదొడ్ల కొరత వంటి మౌలిక వసతుల లోపాలు ఉన్నట్లు వెల్లడైంది. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం ఊట్కూర్‌లోని జడ్పీ ఉన్నత పాఠ శాలను జిల్లా విద్యాశాఖాధికారి స్వయంగా పరిశీలించినట్లు నివేదికలో పేర్కొన్నారు. భారీ వర్షాల కారణంగా పాత రేకుల పైకప్పు నుంచి లీకేజీలు ఏర్పడటంతో మరమ్మతులు జరుగుతున్న సమయంలో విద్యార్థులకు తాత్కాలికంగా చెట్ల కింద తరగతులు నిర్వహించినట్లు నివేదికలో వెల్లడించారు. విద్యార్థులకు సురక్షితమైన తరగతి గదులు, పారిశుధ్య సౌకర్యాలు, ఇతర ప్రాథమిక వసతులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని కమిషన్ స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21-ఎ ద్వారా కల్పించిన విద్యా హక్కు పాఠశాలలో ప్రవేశం కల్పించడంతో పరిమితం కాదని, పిల్లలు సురక్షితమైన, గౌరవప్రదమైన, అనుకూలమైన వాతావరణంలో విద్యను అభ్యసించే పరిస్థితులు కూడా అందులో భాగమేనని కమిషన్ పేర్కొంది.
అన్ని జిల్లాలపై వేదికలు కోరాలి
రాష్ట్రంలోని అన్ని జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారుల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, ప్రాథమిక సౌకర్యాలపై నిలని పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కమిషన్ ఆదేశించింది. అలాగే ఈ అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో చర్చించి ప్రభుత్వ పాఠశాలల్లో సురక్షితమైన తరగతి గదులు, పనిచేసే మరుగుదొడ్లు, ఇతర ప్రాథమిక సౌకర్యాలు కల్పించేందుకు, అవసరమైన మరమ్మతులు చేపట్టేందుకు, పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు తక్షణ, సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని కమిషన్ సిఫారసు చేసింది. మానవ హక్కుల పరిరక్షణ చట్టం 1993లోని సెక్షన్ 18(ఇ) ప్రకారం కమిషన్ సిఫారసులపై తీసుకున్న లేదా ప్రతిపాదించిన చర్యల వివరాలను ఆరు నెలల్లోగా కమిషన్‌కు సమర్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





