– అమెరికా విదేశాంగ మంత్రికి ఇరాన్ కాన్సులేట్ సూచన
ముంబై, మే 23 : అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో భారత్ పర్యటనకు వచ్చిన నేపథ్యంలో ఇరాన్ వ్యంగ్యంగా స్పందించింది. ఇరాన్ ముంబై కాన్సులేట్ రుబియోను ఉద్దేశిస్తూ భారతీయుల నుంచి కొంచెమైనా మర్యాద, సంస్కారం నేర్చుకోండి అంటూ ‘ఎక్స్‌’ ఖాతాలో వ్యంగ్యంగా ఓ పోస్ట్ పెట్టింది. అమెరికా-భారత్‌ల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరిచేందుకు మార్కో రుబియో ప్రస్తుతం భారత్ పర్యటనకు వచ్చారు. యుద్ధం ముగింపు చర్చలు జరుగుతుతన్న ప్రస్తుత తరుణంలో అమెరికాకు చెందిన కొందరు నేతల డిమాండ్లు, ప్రవర్తనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహంగా ఉంది. తమ డిమాండ్లకు తలొగ్గకుంటే మరోసారి సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే ఇరాన్‌ను హెచ్చరించారు. అమెరికా ఉపాధ్యక్షుడు, రక్షణ మంత్రి కూడా ఇరాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ అమెరికా విదేశంగా మంత్రికి చురక అంటించింది. మార్కో రుబియో భారత్ పర్యటన తొలి రోజే ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో కీలక సమావేశం నిర్వహించారు. గంటకుపైగా సాగిన ఈ భేటీలో కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అంతకుముందు రుబియో కోల్‌కతాకు చేరుకుని మథర్ థెరిసా స్థాపించిన మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కేంద్రాన్ని సందర్శించారు.
—————————————————————————————————————————————————————–

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.