ఇటు భూ బకాసురులు..అటు ఇసుకాసురులు.. మధ్యలో మైనింగ్ మాఫియా..!!

“.. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ, పర్యావరణ విధ్వంసం చేస్తూ.మరోవైపు వర్షాలు పడాలని వరుణ యాగాలు చేస్తుంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రభుత్వం గ్రహించి ప్రకృతి విధ్వంసకర పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. లేకపోతే ప్రకృతి ఆగ్రహానికి ప్రజలు తద్వారా ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది..”

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రకృతి విధ్వంసకర పాలన చేస్తోంది..ప్రజాపాలన, ప్రజాస్వామ్యం ప్రభుత్వం, రాజ్యాంగ స్ఫూర్తి, ఇందిరమ్మ పాలన అంటూ గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ.ఇవాళ గత మూడేళ్లుగా ప్రకటించుకున్న ఆదర్శాలకు పూర్తి విరుద్ధంగా పాలన చేస్తొంది.. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు పాలన కంటే ప్రకృతి దోపిడీపై ఫోకస్ పెట్టారు..విశాల ప్రజల ప్రయోజనాల కంటే స్వప్రయోజనాలకు పాలనలో ఫస్ట్ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీలు అమలు కంటే నేతల దోచుకో దాచుకో స్కీం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా అమలైతోంది. తెలంగాణలో  భూ మాఫియా, ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు..ఇక మైనింగ్ మాఫియా గురించి అయితే చెప్పనక్కర్లేదు..పాలకులే స్వయంగా వ్యాపారులైతే ప్రజలతో బిజినెస్ చేస్తారు..ప్రజల సమస్యల్ని గాలికి వదిలేసి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లాభాల వెంటా పరుగులు పెట్టుతారు అని చెప్పడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఒక చక్కటి ఉదాహరణ.

తెలంగాణలో పాలకులు యధేచ్చగా సహజవనరుల దోపిడీ పాల్పడుతున్నారు..ప్రజలను ప్రకృతిని కాపాడాల్సిన ధర్మకర్త బాధ్యతలో ఉన్న పాలకులే కంచె చేను చేసినట్లు ప్రజలకు దక్కాల్సిన సహజ వనరులు, ప్రకృతి సంపదను దోచుకుంటున్నారు.. తెలంగాణ సకల సంపదలకు నెలవు..దేశంలోనే ప్రకృతి సంపదను కడుపులో దాచుకున్న గడ్డ తెలంగాణ. అలాంటి తెలంగాణలో ఇవాళా ప్రజా పాలన కాదు.. ప్రకృతి దోపిడీ పాలన సాగుతోంది.కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కన్న  సంపద దోచుకోవడంపై కన్నుపడింది..పార్టీ పాలనా ప్రభుత్వంపై గుత్తాధిపత్యం సాధించిన ముగ్గురు నేతలు ప్రకృతిని చెరబట్టి  సహజ వనరులపై గుత్తాధిపత్యంతో గుంపుగా దోచుకుంటున్నారు.

ప్రభుత్వంలో  నెంబర్ వన్ నెంబర్ టూల  దందా అంతాఇంతా కాదు..నెంబర్ వన్ చుట్టూ భూ కబ్జా ఆరోపణలుంటే..నెంబర్ టూ చుట్టూ ఇసుక దందా ఆరోపణలు ఉన్నాయి.రాష్ట్రంలో తానే నెంబర్ వన్ అని చెప్పుకునే నేత బంధువులు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు భూములను కబ్జాలు చేస్తూ, అధికారాన్ని అడ్డుపెట్టుకొని ప్రజలను, ప్రశ్నిస్తున్న వారిని బెదిరింపులకు గురి చేస్తూ భూ బకాసురులుగా మారుతున్నారు.

ఇక నెంబర్ టూ ది మరో పరిస్థితి.నెంబర్ వన్ రాష్ట్రంలో భూములపై పడితే నెంబర్ టూ  తెలంగాణలో ఉన్న గుట్టలు, నదుల్లో వనరులు దోపిడీ చేస్తూ ఇసుకాసురుడి మారిండు‌..అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు ఇసుక దందాలో పాలకులు మునిగి పోయారు.మహబూబ్నగర్ నుంచి ఖమ్మం వరకు భూ కబ్జాలకు తెగబడుతున్నారు.ఉత్తర తెలంగాణలో ఇసుక, గుట్టల దందా చేస్తూ.. దక్షిణ తెలంగాణలో భూ దందాలు కబ్జాలకు నెంబర్ వన్ నెంబర్ టూలు పాల్పడుతున్నారు..నదులను చెరబట్టుతున్నారు.. భూములు కబ్జాలు పెడుతున్నారు..గుట్టలను మింగేస్తున్నారు. ఈ ఇసుక దందాలు..భూ కబ్జాలపై ఆరోపణలు చేస్తున్నది ప్రజలో ప్రతి పక్షాలో కాదు స్వయంగా అధికార పార్టీలోని నేతలే సొంత పార్టీ నేతలపై బహిరంగంగానే చేస్తున్నారు.. నెంబర్ వన్ నెంబర్ టూల భూ,ఇసుక దోపిడీపై కాంగ్రెస్ లో నేతల మధ్య వైరుధ్యాలు బయటపడుతున్నాయి.ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి జిల్లాలు అదిలాబాద్ వరంగల్  ఖమ్మం వరకు కాంగ్రెస్ లో విభేదాలు బయటపడుతోన్నాయి.

ప్రభుత్వంలో కరిది భూ కబ్జాలు..మరోకరిది ఇసుక దందా…ఇంకొకరిది మైనింగ్ మాఫియా..భూమిని చెరబడుతూ..జీవ నదులకు సమాధి కట్టుతూ.. మైనింగ్ ను మింగేస్తున్నారు.. నెంబర్ వన్ నెంబర్ టూల ఒకదారి అయితే అధికారికంగా నెంబర్ టూ స్థానంలో ఉన్న మరో నేతది ఇంకోదారి..ఆయన ఏకంగా మైనింగ్ మాఫియా మొదలు పెట్టాడు..పర్సెంటేజ్ కి కేరాఫ్ అడ్రస్ గా మారినా ఈ నేత అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర చేసింది అధికారం కోసం కాదు..పవర్ లోకి వచ్చినా తర్వాత నదిని ఎలా మింగాలి.. బొగ్గు మైనింగ్ మాఫియా ఎలా చేయాలన్న ఉద్దేశంతో చేసినట్లు ఉన్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. ప్రభుత్వంలో నెంబర్ వన్ నెంబర్ టూలు అని చెప్పుకునే వారి దోపిడీ రాష్ట్రంలో మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది..ప్రకృతి విధ్వంసం చేస్తున్నారు…భూములు నదులే కాదు గుట్టలను కూడా మింగేస్తున్నారు.. పర్యావరణ విధ్వంసం సృష్టిస్తూ కాలం తెచ్చిన కరవుతో పోటీ పడుతూ ప్రభుత్వం రూపంలో కృత్రిమ కరువు సృష్టిస్తున్నారు.

ఈ భూ ఇసుకాసురుల వల్ల తంలంగాణలో‌ తల్లి గర్భకోశానికి గురైతోంది..తల్లి గర్భాన్ని చీల్చుతు మైనింగ్ బ్లాస్టింగ్ చేస్తూ.. తల్లి ఒడిని విధ్వంసం చేస్తు భూ ఇసుక మాఫియా రెచ్చిపోతోంది.ఇసుకాసురులు నదిని చంపేస్తున్నారు గోదావరి నదిలో అక్రమంగా అనుమతి మించి ఇసుక దందా చేస్తున్నారు. అదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు గోదారి తీరం మొత్తం  ఇసుకతో డంపింగ్  గుట్టలను తలపిస్తున్నాయి. రోడ్డుకిరువైపులా ఆకాశాన్ని తలపించే ఇసుక గుట్టలు..అక్రమ రవాణా కు వేల లారీల బార్లు తీరుతున్నాయి..ఈ దోపిడీ దారులకు కోర్టులంటే లెక్కలేదు..ఎన్జీటీ తీర్పులంటే పట్టింపు లేదు.మళ్ళీ అధికారంలోకి వస్తామో లేదో అన్నట్టుగా దోపిడీ తెగబడుతున్నారు.

తెలంగాణలో నడుస్తుంది ప్రజాపాలన కాదు.. దోపిడీ పాలన..కబ్జాల పాలనా.. మైనింగ్ మాఫియా పాలన.. తెలంగాణలో ఉన్నది ఇందిరమ్మ పాలన కాదు. భూ కబ్జాదారుల పాలన.. ఇసుకాసురులు పాలన..గుట్టలను అనకొండలా మింగే మైనింగ్ మాఫియా పాలన..ప్రకృతి సంపద ప్రజలందరిది. దీనీపై ఏ ఒక్క వ్యక్తికే అధికార లేదు..కానీ రాష్ట్రంలో సహజ వనరులను ఇద్దరు ముగ్గురు పాలకులు చెరబట్టారు..వాళ్ళ కబంద “హస్తం” లో బంధించారు.. ప్రకృతి విధ్వంసం చేస్తూ సాండ్, ల్యాండ్, మైనింగ్ లిక్కర్ మాఫియా  పాలనా నడుస్తోంది. రాష్ట్రంలో సంపద సృష్టించడం కాదు.. ప్రజలు దశాబ్దాలుగా ప్రకృతితో కలిసి సృష్టించుకున్న సంపదనను దోచుకుంటున్నారు అధికార పార్టీలో ఆ ముగ్గురు నేతలు.. రాష్ట్ర సహజ సంపదను పంచుకుని దోచుకుంటున్నారు..

రాష్ట్రంలో  భూ బకాసురులు.. ఇసుకాసురులు.. మైనింగ్ మాఫియా స్వైరవిహారం చేస్తున్నారు.. కాంగ్రెస్ ప్రభుత్వం నది విధ్వంసం చేస్తొంది..రోడ్ల విధ్వంసం..పర్యావరణ విధ్వంసం.. ప్రకృతి విధ్వంసం చేస్తోంది..అదిలాబాద్, ఖమ్మం, ములుగులో చరిత్ర క్షమించని నది విధ్వంసానికి కాంగ్రెస్ ప్రభుత్వం కారణమైతోంది. నది గర్భాన్ని చీల్చుతూ రక్తపు మడుగులోంచి ఇసుక దోపిడీ చేస్తున్నారు.నది ఒడ్డును ఇసుక గుట్టలుగా మార్చుకున్నారు.

ప్రకృతి ప్రశాంతంగా ఉంటేనే ప్రభుత్వం సాఫిగా సాగుతోంది.. పర్యావరణ ప్రశాంతతను పాలకులు ఏ మాత్రం విధ్వంసం చేసిన.. పర్యావరణ సమతుల్యతను దెబ్బతీసినా ప్రకృతి ప్రకోపానికి గురికావాల్సి ఉంటుంది.. ప్రకృతి ఆగ్రహానికి మొదట బలయ్యేది సామాన్య ప్రజలే.. జనాలు బలైతే ప్రభుత్వాలకు, పాలకులకు వాళ్ళు రాజకీయ సమాధి కట్టితారు. ఇప్పటికే ఇసుక మాఫియా కోసం కాళేశ్వరం ప్రాజెక్టు ను గత రెండేళ్లుగా ప్రభుత్వం పడావ్ పెట్టింది.. ఏకంగా ప్రాజెక్టు పియర్ల కింద నుంచి ఇసుకను తోడేసుకున్నారు..  ఒకవైపు రాష్ట్రంలో ఎల్ నినో కరువు కమ్మేసింది.. జిల్లాలో సాగునీరు లేక కరుపు పరిస్థితులు కనిపిస్తున్నాయి..నగరాల్లో వానాకాలంలొనే తాగునీటి ఎద్దడి నెలకొంది.. భూగర్భ జలాలు అడుగంటాయి..

రాష్ట్రాన్ని కరువు కోరలు తరుముతుంటే దాని నుండి బయటపడేందుకు ప్రణాళిక చేయకుండా.. గోదావరి నదిలో ఇసుకను అక్రమంగా తవ్వేస్తుంటే భవిష్యత్తులో ఉత్తమ తెలంగాణ గోదావరి పరివాహక ప్రాంతంలో మరింత కరువు సంభవించే ప్రమాదం ఉంది..నదిలో లెక్కకు మించి తొవ్వడం వల్ల భూమిలోకి నీరు ఇంకవు.. దీంతో భూగర్భ జలాలు లేక ఉత్తర తెలంగాణ సాగుకే కాదు ప్రజలు దూపకేడ్చే దుర్భర పరిస్థితి ఏర్పడుతుంది.. ఒకవైపు ప్రభుత్వం ప్రకృతి సంపదను అడ్డగోలుగా దోచుకుంటూ, పర్యావరణ విధ్వంసం చేస్తూ.మరోవైపు వర్షాలు పడాలని వరుణ యాగాలు చేస్తుంటే చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఉంది.. ప్రకృతిని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది.. పర్యావరణాన్ని రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుందని ప్రభుత్వం గ్రహించి ప్రకృతి విధ్వంసకర పాలనకు ఫుల్ స్టాప్ పెట్టాలి.. లేకపోతే ప్రకృతి ఆగ్రహానికి ప్రజలు తద్వారా ప్రభుత్వం గురికావాల్సి వస్తుంది.

తోటకూర రమేష్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *