ఉమ్మడి వరంగల్ జిల్లాను పట్టించుకునేవారు కరువు

– స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం

వరంగల్, ప్రజాతంత్ర, జూలై 8: ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రజా సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రి కొండా సురేఖ తనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి స్పందించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, వాస్తవాలను ప్రజలకు తెలియజేసేందుకు వరంగల్ లో బుధ వారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పలు కీలక వ్యా ఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజ కవర్గ అభివృద్ధి కోసం ఏ అధికారినైనా కలిసే హక్కు ప్రజాప్రతినిధిగా తనకు ఉందని, తాను ఎలాంటి నిబంధనలను ఉల్లంఘించలేదని, తన అధికా రాలు, పరిమితులు తనకు పూర్తిగా తెలుసని అన్నారు. బిజినెస్ రూల్స్, రాజ్యాంగం ప్రకారం కేబినెట్ హోదాలో ఉన్న మంత్రులు మాత్రమే అధి కారిక సమీక్షలు నిర్వహిస్తారని, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ సమీక్షల్లో పాల్గొంటారని తెలిపారు. తన నియోజకవర్గంలోని ఆలయాల అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ కమిషనర్ను కలిసి ఆలయ కమిటీ చైర్మన్లతో కలిసి వినతిపత్రాలు అందజేశానని చెప్పారు. తాను తప్పు చేయనప్పుడు ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంటూ, అవగాహన లేకుండా తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అభివృద్ధి గురించి ఆలోచించని వారు వివాదాలు సృష్టించి వార్తల్లో నిలవాలని చూస్తున్నారని విమర్శించారు. వర్షాభావ పరిస్థితుల్లో దేవాదుల ప్రాజెక్టుపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని, ఎంజీఎం ఆస్పత్రికి సూపరింటెండెంట్ నియామకం, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల ప్రారంభం వంటి కీలక అంశాలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రజల కోసం అధికారాన్ని వినియోగించాలే గానీ, అనవసర వివాదాలకు వేదికగా మార్చకూడదని ఆయన హితవుపలికారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *