తెలంగాణా కోసం అలుపెరుగని పోరాటం

మహనీయుడు బాపూజీ ..కొనియాడిన సీ ఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్26: మ‌లి ద‌శ తెలంగాణ ఉద్య‌మానికి త‌న ఇంటిని, త‌న ఆస్తుల‌ను దానం చేసిన మ‌హ‌నీయుడు కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అయిదు ద‌శాబ్దాలుగా అలుపెరుగ‌ని కృషి చేసిన మ‌హ‌నీయుడు బాపూజీ అని ముఖ్య‌మంత్రి అన్నారు.

కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ జ‌యంతిని పుర‌స్క‌రించుకొని ఆయ‌న సేవ‌ల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి స్మ‌రించుకున్నారు. బ‌హు భాషా కోవిదుడైన బాపూజీ త‌న జీవితాంతం బ‌డుగు, బ‌ల‌హీన వ‌ర్గాల అభ్యున్న‌తికి పాటుప‌డ్డార‌ని ముఖ్య‌మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ స‌మాజం స‌దా ఆయ‌న సేవ‌ల‌ను స్మ‌రించుకునేందుకు వీలుగా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ కి కొండా ల‌క్ష్మ‌ణ్ బాపూజీ పేరు పెట్టామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *