- బతుకమ్మ చీరలకు రూ.197 కోట్ల బకాయిలు
- కెటిఆర్‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
సిరిసిల్ల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 26: తన మీద కోపంతో సిరిసిల్ల నేతన్నలకు తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ పై కోపంతో ఏ పథకాలను ఆపడం లేదని.. నేతన్నలను ఆదుకునేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. సిరిసిల్ల జిల్లాల్లో జరిగిన అవకతవకలన్ని త్వరలోనే బయటకు తీస్తామని, .దానిని కేటీఆర్ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. నేతన్నలకి బకాయిలు పెట్టిన మీరు వారికి సారీ చెప్పాల్సింది పోయి.. నేతన్నలపై ఇంకా రాజకీయం చేస్తావా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేటీఆర్ నేతన్నల పై మొసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. బతుకమ్మ చీరాలను సూరత్ నుంచి తెప్పించి కోట్లు సంపాదించి ఎవరు..? బతుకమ్మ చీరలకు రూ.197 కోట్లు బకాయిలు పెట్టింది నీవు కదా అని నిలదీశారు. బతుకమ్మ చీరలపై ఇంకా రాజకీయం చేస్తావా అంటూ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ మొగోడు కాబట్టే మిమ్మల్ని గద్దె దించాడని.. ఇకనైనా దురాంకారం, పొగరు మాటలు బంద్ చేయ్ చేయాలని కేటీఆర్‌కు సూచించారు. బీఆర్‌ఎస్‌లో మిగిలేది నలుగురేనని.. పదేళ్ల ఆ పార్టీకి అధికారం కలేనని అన్నారు.
లోక సభ ఎన్నికల్లో ఒక్క సీటు గెలువలేదు.. మళ్ళీ ఉపఎన్నికలు అంటున్నావ్, బై ఎలక్షన్స్ వొస్తే బీఆర్‌ఎస్ నామారూపాలు లేకుండా పోతుందని విరుచుపడ్డారు. బీఆర్‌ఎస్ పార్టీ స్కీమ్‌లు అన్నీ స్కాం లేనని విమర్శలు గుప్పించారు. తెలంగాణను రూ.7లక్షల కోట్ల అప్పుల పాలు చేసిపోయినా.. మేము ప్రజా పాలన చేస్తున్నామని పేర్కొన్నారు.