ఖైరతాబాద్‌ ‌మహాగణపతి వద్ద భక్తజనసంద్రం

– భారీగా తరలివచ్చిన భక్తజనం

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,సెప్టెంబరు 4: ఖైరతాబాద్‌ ‌మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాదిగా భక్తులు పోటెత్తారు. దర్శనానికి చివరి రోజు కావడంతో గురువారం సాయంత్రం భక్తులు తరలివస్తుండటంతో ఖైరతాబాద్‌ ‌పరిసరాలు భక్త జనసంద్రంగా మారాయి. ముందస్తు నిమజ్జన ఏర్పాట్లలో భాగంగా బడా గణేశ్‌ ‌దర్శనానికి గురువారం రాత్రి 11 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న భక్తులను మాత్రమే అనుమతించారు. శుక్రవారం నిమజ్జన ఏర్పాట్లు చేసేయాల్సి ఉన్నందున దర్శనానికి అవకాశం లేదని ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దర్శనానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండటంతో భక్తులు భారీగా తరలివచ్చారు. దీంతో వీఐపీ దర్శనాలు నిలిపివేశారు. క్యూలైన్‌లో ఉన్న వారినే అనుమతించారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో భక్తులు ఖైరతాబాద్‌ ‌గణపతిని దర్శించుకున్నారు. బుధవారం తోపులాట జరిగి పలువురు స్పృహ కోల్పోయిన విషయం తెలిసిందే. భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌ ‌క్రమబద్దీకరించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *