ప్రత్యేక కమిషనర్ ప్రియాంక
హైదరాబాద్, జూన్ 30: ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో సమాచార పౌర సంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తుందని ఆ శాఖ ప్రత్యేక కమిషనర్ సిహెచ్.ప్రియాంక అన్నారు. సమాచార శాఖ ప్రధాన కార్యాలయంలో పౌర సంబంధాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ముళ్ళపూడి శ్రీనివాస్ కుమార్ సోమవారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఆయనను కార్యాలయ అధికారులు, ఉద్యోగులు ఘనంగా సన్మానించారు. ప్రియాంక ముఖ్యఅతిథిగా హాజరైన ప్రియాంక మాట్లాడుతూ శ్రీనివాస్ కుమార్ తమ విధులను అంకితభావంతో సమర్థవంతంగా నిర్వర్తించారని ప్రశంసించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులను పరిచయం చేసుకున్నారు. శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ తన 38 ఏండ్ల ఉద్యోగ జీవితం సంతృప్తిగా సాగిందన్నారు. అనేక పురస్కారాలు లభించాయన్నారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి అదనపు సంచాలకుడు డి.ఎస్.జగన్, సంయుక్త సంచాలకులు కె.వెంకటరమణ, వెంకటేశ్వరావు, ఉప సంచాలకులు మధుసూదన్, వై.వెంకటేశ్వర్లు, ప్రసాద్, హష్మీ, అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.