బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 30 : సెంట్రల్ వాటర్ కమిషన్, జీడబ్ల్యూడీటీలు పరిశీలించకుండా గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులిచ్చేది లేదని కేంద్ర పర్యావరణ నిపుణుల కమిటీ తేల్చి చెప్పడాన్ని స్వాగతిస్తున్నామని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ఇది బీఆర్‌ఎస్ పోరాటం ఫలితమని, తెలంగాణ ప్రజల విజయం అని అన్నారు. బనకచర్ల పేరిట తెలంగాణ గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయే ఏపీ కుట్రలకు ఇది చెంపపెట్టు అని అన్నారు. తెలంగాణ నీటి హక్కులకు అన్యాయం చేసే విధంగా రూపొందించిన బనకచర్ల ప్రాజెక్టును పూర్తిస్థాయిలో నిలిపివేసే వరకు బీఆర్‌ఎస్ పోరాటం కొనసాగుతుందని హరీష్‌రావు స్పష్టం చేశారు.