– రూ.300 కోట్లకు పైగానే ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు
– బినామీల పేరున ఆస్తులు.. ముందే క్యాన్సిలేషన్ డీడ్‌లు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 8: ఏసీబీకి చిక్కిన డీఎస్పీ భీమ్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఆయన నుంచి రెండు మెమరీ కార్డులను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. భీమ్‌రెడ్డి ఆస్తుల విలువ రూ.300 కోట్లపైన ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం ఉంటున్న విల్లా ఎలా కొన్నారనే విషయంపై ఆయన స్పష్టత ఇవ్వలేదని ఏసీబీ అధికారులు తెలిపారు. మెమరీ కార్డులు, డైరీల ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయని అన్నారు. మెమరీ కార్డులోని వివరాల ఆధారంగా ఆస్తుల డాక్యుమెంట్లు సీజ్ చేసినట్లు తెలిపారు. ’నాకు ఇవ్వాల్సిన వాళ్లు, నేను ఇవ్వాల్సినవి’ అంటూ డీఎస్పీ భీమ్‌రెడ్డి తన డైరీలో రాసుకున్నాడని ఏసీబీ అధికారులు తెలిపారు. బినాలు ఎప్పుడైనా తిరగబడే ప్రమాదం ఉందని ఆయన ముందే ఊహించాడన్నారు. అక్రమాస్తులు కూడపెట్టడంలో భీమ్‌రెడ్డి చాలా తెలివిగా వ్యవహరించాడని ఏసీబీ అధికారులు తెలిపారు. ఆస్తులను బినామీ పేర్ల మీద రిజిస్ట్రేన్ చేయించారని అన్నారు. బినామీల దగ్గర నుంచి క్యాన్సిలేషన్ డీడ్‌లను ముందే రాయించుకున్నాడని ఏసీబీ అధికారులు వెల్లడించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



