అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్ దిట్ట

– మోటర్లకు మీటర్లపై మండిపడ్డ ఎంపీ అర్వింద్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21: వ్యవసాయ మోటర్లకు కరెంట్ మీటర్లు పెట్టాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగిత్యాల సభలో కేసీఆర్ సోమవారం చెప్పినవన్నీ కేంద్రం నిధులతో చేసినవేనని చెప్పారు. కేసీఆర్.. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిల చెల్లింపులు చేయలేదన్నారు. భూముల ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయని అర్వింద్ తెలిపారు. 72 ఏళ్ల వయసులోనూ కేసీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని విమర్శించారు. ఆయన హయాంలోనే సివిల్ సప్లయిస్‌లో అక్రమాలు ప్రారంభమయ్యాయని, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆనాటి నుంచి కేసీఆర్ కోవర్టు అని, ఆయన పేరుకే కాంగ్రెస్.. నిజానికి బీఆర్ఎస్ కార్యకర్త అని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లయిస్‌లో అక్రమాలను ఉత్తమ్ కొనసాగిస్తున్నారన్నారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లులో కరెంట్ మీటర్ అనేది లేనేలేదని, రైతుల వద్ద కరెంట్ బిల్లు వసూలు చేయాలని కేంద్రం ఎక్కడా చెప్పలేదని స్పష్టం చేశారు. ఆదివాసీలకు పోడు భూములకు పట్టాలు ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని, అయితే ఆదిలాబాద్‌లో పోడు భూముల పట్టాలు అడిగిన మహిళలపై దౌర్జన్యాలు చేయించారని ఆరోపించారు. తెలంగాణలో రైతులను ఆదుకోలేదు కానీ.. పంజాబ్‌కు వెళ్లి చెక్కులు ఇచ్చి వచ్చారని అర్వింద్ ఎద్దేవా చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *