ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాష్ట్ర పండుగ బతుకమ్మ ముగింపు కార్యక్రమం సద్దుల బతుకమ్మ సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలకు బీఆరఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మదిరోజుల పాటు ఆడబిడ్డల ఆటపాటలతో సాగిన బతుకమ్మ సంబురాలతో రాష్ట్రవ్యాప్తంగా సందడి నెలకొన్నదన్నారు. ‘మల్లారావమ్మా బతుకమ్మా.. మా బతుకులు బాగు చేయవమ్మా’ అని కోరుకుంటూ బతుకమ్మకు వీడ్కోలు పలుకుతూ ఘనమైన తెలంగాణ సాంస్కృతిక వేడుకలను ఆడబిడ్డలు ముగిస్తారని కేసీఆర్ తెలిపారు.
రాష్ట్ర సాధనలో, తెలంగాణ ప్రగతిలో మహిళల భాగస్వామ్యం మహోన్నతమైనదని, వారి కృషిని, త్యాగాలను గుర్తించిన నాటి బీఆరఎస్ ప్రభుత్వం వారి సంక్షేమం కోసం పలు పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. ఆడబిడ్డలకు ఎలాంటి కష్టం కలగకుండా చూస్తూ వారి సంక్షేమానికి చిత్తశుద్దితో కృషి చేయడం ద్వారానే బతుకమ్మ పండుగ స్పూర్తిని కొనసాగించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *