– నేరెళ్లలో ఇసుక లారీల ధాటికి ఛిద్రమైన ప్రాణాలు
– బాధితులకు నేటికీ అందని చేయూత
– అధికారుల నిర్లక్ష్యంతో నలిగిపోతున్న మృతుడి కుటుంబం
– ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
సిరిసిల్ల, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామం పేరు వినగానే అప్పట్లో ఇసుక టిప్పర్ల విధ్వంసం, గ్రామస్తుల తిరుగుబాటు, ఆపై పోలీసుల చిత్రహింసల ఘటనే గుర్తొస్తుంది. జాతీయ ఎస్సీ కమిషన్ సందర్శనలతో సంచలనం సృష్టించిన ఈ ఘటన వెనుక.. ఒక అమాయక రైతు కుటుంబం అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతం నేరెళ్ల బాధిత కుటుంబాల ప్రస్తుత పరిస్థితులపై అధ్యయనం చేసేందుకు వెళ్లిన ‘ప్రజాతంత్ర్ణ బృందానికి బాధితులు కన్నీటిపర్యంతమవుతూ తమ గోడును వెల్లబోసుకున్నారు.
నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీలు టిప్పర్ల కారణంగా అనేక జీవితాలను ఛిద్రం చేసిన విషయం తెలిసిందే. ఇసుక రవాణా చేస్తున్న లారీలు, టిప్పర్ల వల్ల ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఇసుక లారీలను అడ్డుకున్న గ్రామ యువకులను అదుపులోకి తీసుకొని చిత్రహింసలకు గురిచేశారనే ఆరోపణలు వినిపించాయి. ఈ ఘటనపై కేంద్ర ఎస్సీ కమిషన్ సైతం నేరెళ్ల గ్రామాన్ని సందర్శించింది. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ మనిషి చావు చెల్లనిదైపోయి. ఎక్కడా ఆ మనిషి ప్రస్తావనే లేకుండా పోయి. ఆ కుటుంబ బతుకులు చెదిరిపోయాయి. ఆ కుటుంబం పడుతున్న వేదన వర్ణనాతీతం.
ఒక్క టిప్పర్ ప్రమాదం.. ఛిద్రమైన మల్లేశం కుటుంబం
కాల చక్రంలో వెనక్కి వెళ్తే.. నేరెళ్ల గ్రామానికి చెందిన గంధం మల్లేశం ఓ సాధారణ రైతు. ఆయన భార్య భాగ్యమ్మ. ఇద్దరు కుమారులు చంద్రం, రవి. చంద్రానికి అప్పటికే వివాహం కాగా. రవి అవివాహితుడు.తల్లిదండ్రులకు సహాయంగా ఉంటున్నాడు. ఈ క్రమంలో గంధం మల్లేశం తన కుమారుడు రవితో కలిసి బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా టిప్పర్ ఢీకొని ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన మల్లేశం, రవిలను సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతున్న మల్లేశం మరుసటి రోజు, 2017 మే 26న న కన్నుమూశారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం రవిని మరో ఆస్పత్రికి తరలించారు. మల్లేశం మృతితో గ్రామస్థుల్లో ఆగ్రహం పెల్లుబికింది. అనేక నిరసనలు చేపట్టారు. మరికొన్ని రోజులకే, 2017 జూలై 2న నేరెళ్ల గ్రామానికి చెందిన మరో రైతు రోడ్డు ప్రమాదంలో భూమయ్య మరణంతో ప్రజల్లో ఆగ్రహం రెట్టింపయింది. గ్రామస్థులు ఆందోళన బాటపట్టారు. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన భూమయ్య.. కుటుంబానికి, ఆందోళనల ఫలితంగా బాధితులకు ఆలస్యంగానైనా చేయూత అందించే యత్నం జరిగింది. కానీ రోజులు గడుస్తున్నా గంధం మల్లేశం కుటుంబానికి సహాయం అందలేదు. ఆ కుటుంబాన్ని క్రమంగా అందరూ మర్చిపోయారు. మల్లేశం చావు చెల్లనిదైపోయింది. చెదిరిపోయిన ఆ కుటుంబానికి ఆసరా కరువైంది.
బతుకులు చెల్లాచెదురు
ఇటీవల నేరెళ్ల బాధితులకు చేయూత అందించేందుకు జరిగిన ప్రయత్నాల్లోనూ కనీసం గంధం మల్లేశం ప్రస్తావన లేకుండా పోయింది. గంధం భాగ్యమ్మ ‘ప్రజాతంత్ర్ణతో మాట్లాడుతూ.. నిఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితుల్లో ఎన్నో కష్టాల మధ్య కుటుంబాన్ని కాపాడుకుంటూ వచ్చాం. అప్పుల మధ్యే కుమారుడు రవికి వివాహం చేశాం” అని తెలిపారు. ప్రస్తుతం రవి పరిస్థితి కూడా కష్టంగానే ఉందని భాగ్యమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయాల ప్రభావం వల్ల రవి సరిగ్గా పనిచేయలేకపోతున్నాడని తెలిపారు. పెద్ద కుమారుడు చంద్రం ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లగా, చిన్న కుమారుడు రవి ఆర్టీసీలో కాంట్రాక్టు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. నిటిప్పర్ మా జీవితాలను చిన్నాభిన్నం చేసింది” అంటూ భాగ్యమ్మ రోదిస్తూ తెలిపారు. ప్రస్తుతం తాను ఉపాధి హామీ పనులతో పాటు వ్యవసాయ కూలి పనులకు వెళ్తున్నట్లు తెలిపారు. నేరెళ్ల ఘటన బాధితుల గుండెల్లో ఇప్పటికీ ఆవేదన తడిగానే కన్నీటి తడి తగులుతుంది విస్మరణకు గురైన గంధం మల్లేశం కుటుంబానికి కూడా చేయూత అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





