రేపు పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన

– ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు
– జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్‌లో కృతజ్ఞత సభ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 3 : ప్రజా ప్రతినిధిగా తన ప్రస్థానం ప్రారంభించి 20ఏళ్లు పూర్తి అవుతున్న‌సందర్భంగా ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి శనివారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించనున్నారు. తనకు జెడ్పీటీసీగా రాజకీయ జన్మనిచ్చిన మిడ్జిల్ గడ్డపై ‘కృతజ్ఞత సభ’ను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు నాగర్‌కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం ఊరుకొండపేటకు చేరుకుంటారు. ఊరుకొండపేట ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించుకుని ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. మధ్యాహ్నం 1 గంటకు ఆలయ ఆవరణలో ఆత్మీయులు, ఆనాటి పెద్దలతో లంచ్, మాట ముచ్చట కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడినుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి 2.45 గంటలకు మిడ్జిల్ మండల కేంద్రానికి చేరుకుంటారు. మిడ్జిల్‌లో వెల్జాల క్రాస్ రోడ్డు వద్ద బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, మాజీ ఎమ్మెల్యే ద్యాప గోపాల్ రెడ్డి (గుడిగానిపల్లి గోపాల్ రెడ్డి) విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరిస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు మిడ్జిల్ బహిరంగ సభా ప్రాంగణానికి చేరుకుని మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం కృతజ్ఞత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటనకు సంబంధించి ఉమ్మడి జిల్లా యంత్రాంగం, కాంగ్రెస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశాయి.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *