– జలశక్తి సదస్సులో తెలంగాణ సమగ్ర జలభద్రత నమూనా
– 25.70 లక్షల ఎకరాల ఆయకట్టుకు స్థిరీకరణ
– 9.70 టీఎంసీల నిల్వ సామర్థ్యం పునరుద్ధరణ
– గొలుసుకట్టు చెరువుల వ్యవస్థకు సమగ్ర, దీర్ఘకాలిక పరిరక్షణ
– నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 31 : దేశవ్యాప్తంగా సుస్థిర జలవనరుల నిర్వహణకు సమన్వయంతో కూడిన కార్యాచరణ రూపొందించే లక్ష్యంతో సెప్టెంబర్ 1, 2 తేదీల్లో ధిిల్లీలో నిర్వహించనున్న జాతీయ సదస్సులో తెలంగాణ తన సమగ్ర జలభద్రత నమూనా(యÖనిఫైడ్ వాటర్ సెక్యూరిటీ మోడల్)ను దేశం ముందుంచనుందని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. ఈ జాతీయ సదస్సు నేపథ్యంలో సచివాలయంలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సదస్సులో రాష్ట్రం తరఫున సమర్పించనున్న ప్రజెంటేషన్‌లో పొందుపరచాల్సిన అంశాలు, రాష్ట్రంలో అమలవుతున్న జలసంరక్షణ కార్యక్రమాలు, గొలుసుకట్టు చెరువుల పరిరక్షణ, జలవనరుల జియోట్యాగింగ్, భూగర్భజలాల పర్యవేక్షణతోపాటు దేశవ్యాప్తంగా అనుసరించదగిన సమగ్ర జలభద్రత విధానంపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. దేశ జలభద్రతకు సంబంధించిన కీలక సవాళ్లపై కేంద్రం, రాష్ట్రాలు ఒకే వేదికపై చర్చించి భవిష్యత్ కార్యాచరణకు దిశానిర్దేశం చేయనున్న నేపథ్యంలో ఈ సదస్సుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందని మంత్రి పేర్కొన్నారు. జలవనరుల సంరక్షణ నుంచి ప్రజలకు సురక్షితమైన తాగునీటి సరఫరా వరకు వివిధ అంశాల్లోన్ కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మరింత సమన్వయం సాధిస్తూ నిర్దిష్ట కాలపరిమితితో కూడిన జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





