– మద్యం బ్రాండ్లకు నోటిఫికేషన్‌పై హరీష్‌రావు ఫైర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలో లక్షలాదిమంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయడంలో మీనమేషాలు లెక్కిస్తోందని అసెంబ్లీలో బీఆర్ఎస్ ఉప నాయకుడు హరీష్‌రావు విమర్శించారు. కానీ 121 మద్యం బ్రాండ్ల నోటిఫికేషన్లు మాత్రం ఆఘమేఘాల మీద విడుదల చేస్తోందన్నారు. యువత భవిష్యత్తుకు భరోసా ఇచ్చే జాబ్ నోటిఫికేషన్లు ఇవ్వని మీకు మద్యం వ్యాపారానికి మాత్రం ఇంత తొందర ఎందుకు అని ప్రశ్నించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం కంటే మద్యం అమ్మకాలపైనే ప్రభుత్వానికి ఎక్కువ శ్రద్ధా అని నిలదీశారు. యువత డిగ్రీలు, పిజీలు పూర్తి చేసి జాబ్స్ కోసం ఎదురు చూస్తుంటే ప్రభుత్వం మద్యం షాపులు, బ్రాండ్లు పెంచి, డబ్బు వసూలు చేయాలని చూస్తోందన్నారు. సమయానికి యువతకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వలేని ఈ చేతగాని సర్కారు మద్యం షాపులకు, బ్రాండ్లకు మాత్రం నోటిఫికేషన్ ఇస్తున్నది అని ఎద్దేవా చేశారు. రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు మోసం.. ఫీజు రీయింబర్స్ మెంట్ మోసం.. రాజీవ్ యువ వికాసం.. వికసించక ముందే వాడిపోయింది.. మేనిఫెస్టోలో చెప్పిన హామీలకు గతి లేకుండా పోయింది.. రేవంత్ పగ.. యువత దగా అన్నట్లుగా తయారైంది అని వ్యాఖ్యానించారు. జాబ్ నోటిఫికేషన్లు నిల్.. లిక్కర్ నోటిఫికేషన్లు ఫుల్.. రేవంత్ రెడ్డీ.. ఇదేనా మీరు చెప్పిన ప్రజా పాలన అని హరీష్‌రావు అడిగారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




