రాష్ట్రంలో శరవేగంగా అభివృద్ధి పనులు

– కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ప్రారంభం
– 5.87.53 నిర్మాణం 4,235 ఎకరాలకు సాగునీరు
– గిరిజనుల ఆకాంక్ష మేరకు సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు
– మంత్రి కోమటిరెడ్డి
– పిల్లలను డ్రగ్స్ కు దూరంగా ఉంచాలి: మంత్రి జూపల్లి

వనపర్తి, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను శరవేగంగా ముందుకు తీసుకెళ్తూ అన్ని వర్గాల ప్రజలకు ప్రజాప్రభుత్వం అండగా నిలుస్తోందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పరిధిలోని కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి మోటార్లు ఆన్ చేసి సోమవారం ప్రారంభించారు. రూ 87.53 కోట్లతో నిర్మించిన కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా వనపర్తి, నాగర్క ర్నూల్ జిల్లాల్లోని 18 తండాల పరిధిలో మొత్తం 4,235 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనుంది. ఇందులో వనపర్తి జిల్లాలో 3.384 ఎకరాలు, నాగర్ కర్నూల్ జిల్లాలో 851 ఎకరాలకు సాగునీరు అందనుంది. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రా జెక్ట్ ప్రారంభం కావడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రైతు లకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని. గిరిజనుల ఆకాంక్ష మేరకు కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గిరిజనుల ఇష్టదైవమైన సంత్ సేవాలాల్ పేరు పెట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పాలమూరు ప్రాజెక్ట్ను పూర్తి చేసేందుకు శరవేగంగా అభివృద్ది పనులు చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రత్యేకంగా కృషి చేస్తున్నారని తెలిపారు.

యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి : మంత్రి జూపల్లి

యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మం త్రి జూపల్లి కృష్ణారావు సూచించారు. గత పాలకులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చా రని విమర్శించారు. రాష్ట్రానికి ఉన్న ఆర్థిక భా రాన్ని ఎదుర్కొంటూనే ప్రజలకు అవసరమైన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందన్నారు.

4,235 ఎకరాలకు సాగునీరు

నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా రెండు జిల్లాల్లో 4,235 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ కోసం రూ.87.53 కోట్లు ఖర్చు చేయడంతో పాటు 245 ఎకరాల భూసేకరణ చేపట్టినట్లు ఆయన వివరించారు. ప్రతి కుటుంబానికి ఏదో ఒక సంక్షేమ పథకం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కర్నె తండా ప్రాంతంలో మొబైల్ టవర్ ఏర్పాటు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో కర్నె తండా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కోసం రూ.87 కోట్లతో జీవో తీసుకువచ్చినప్పటికీ సుమారు రూ.47 కోట్లు ఖర్చు చేసి పనులను మధ్యలోనే నిలిపివేశారని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ పనుల కోసం సుమారు రూ.29 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. మిగిలిన రూ.11 కోట్లను భూసేకరణ, ఇతర పెండింగ్ పనులకు వెచ్చించి ప్రాజెక్ట్ను పూర్తిస్థాయిలో అందుబా టులోకి తీసుకువస్తామని ఆయన తెలిపారు. వనపర్తి జిల్లాలో అభివృద్ధి పనులకు ప్రభు త్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని, ఇప్పటి వరకు జిల్లాలో సుమారు రూ.2,100 కోట్ల విలువైన అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు.

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత

నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో మార్కండేయ ప్రాజెక్టుతోపాటు కర్నె తండా వంటి సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రారంభించుకున్నామని తెలిపారు. అనంతరం వనపర్తి, నాగర్ కర్నూల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభితో కలిసి సర్జ్ పూల్ వద్ద ప్రారంభమైన నీటి ప్రవాహానికి పూజలు చేసి పూలు సమర్పించారు. నాగర్ కర్నూల్ ఎస్పీ సంగ్రామ్ సింగ్ పాటిల్, మున్సిపల్ చైర్మన్లు, మార్కెట్ చైర్మన్లు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *