అటవీ శాఖలో పలువురు అధికారుల డిప్యూటేషన్లు రద్దు

– పీసీసీఎఫ్ కార్యాలయంలో వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశం
– మంత్రి సురేఖకు తెలియకుండానే జీవో వెలువడిందంటూ కలకలం

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 24 : ప్రభుత్వం అటవీ శాఖలో ఒక కీలకమైన పరిపాలనా నిర్ణయం తీసుకుంది. శాఖ పరిధిలో తీవ్ర కలకలం రేపుతూ పలువురు ఐఎఫ్ఎస్ అధికారులు, ఇతర ఉన్నతాధి కారుల డిప్యూటేషన్లను రద్దు చేస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది. డిప్యూటేషన్పై పనిచే స్తున్న అధికారుల డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేస్తూ, సంబంధిత అధికారులు వెంటనే హైదరాబాద్లోని పీసీసీఎఫ్ (ప్రధాన అటవీ సంరక్షణ అధికారి) కార్యాలయంలో రిపోర్ట్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి. కాగా, సాధారణంగా ఏ ప్రభుత్వ శాఖలోనైనా అధికారుల డిప్యూటేషన్లు, బదిలీల నిర్ణయం సంబంధిత శాఖ మంత్రి ఆమోదంతోనే జరుగుతాయి. అయితే అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకు కనీస సమాచారం కూడా ఇవ్వకుండానే ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేయడం సచివా లయంలోనూ, రాజకీయ వర్గాల్లోనూ తీవ్ర చర్చనీయాంశమైంది. ఇటీవల మంత్రి సురేఖ కుటుంబ సభ్యుల వ్యాఖ్యలు, సొంత పార్టీ నాయకులతో విభేదాలు సృష్టించిన రాజకీయ వాతావరణం నేపథ్యంలో సీఎంఓ నేరుగా జోక్యం చేసుకుని ఈ కీలక నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న వ్యూహంపై రకరకాల ప్రచారాలు జోరందుకున్నాయి. డిప్యూటేషన్ రద్దుతో అధికారులను తిరిగి మాతృ శాఖలకు లేదా కొత్త పోస్టింగ్ లకు పంపే దిశగా చర్యలు ప్రారంభమయ్యాయి. ప్రభుత్వంలో మంత్రి ప్రమేయం లేకుండా శాఖలో పెద్ద మార్పు జరగడం రాబోయే రోజుల్లో రాజకీయపరమైన పరిణామాలకు దారితీసే అవకాశం కనిపిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *