– నీటిపారుదల ప్రాజెక్టులకు భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలి
– ప్రజాప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ సమావేశం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24 : సెప్టెంబర్ 7వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుబాటులో ఉన్న ప్రజాప్రతినిధులతో ఆయన సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. నియోజకవర్గాల పరిధిలోని నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ భూసేకరణ పనులు వేగంగా పూర్తి చేయాలని, భూసేకరణపై నిర్లక్ష్యం వహిస్తే ఎప్పటికీ ప్రాజెక్టులు పూర్తి కావని అన్నారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, ఫారెస్టు క్లియరెన్సులకు సంబంధించి నిధులను వెంటనే మంజూరు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ప్రతీ ఒక్కరూ నియోజకవర్గ అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలని సీఎం సూచించారు. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, విప్‌లు ఆది శ్రీనివాస్, రామచంద్ర నాయక్, బీర్ల ఐలయ్య, వేముల వీరేశం, ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, వీర్ల పల్లి శంకర్, ప్రేమ్‌సాగర్ రావు, నవీన్ యాదవ్, మట్టా రాగమయి, మందుల సామేల్, వెడ్మ బొజ్జు, కోరం కనకయ్య, లక్ష్మీకాంతరావు, రామ్‌దాస్ నాయక్, కడియం శ్రీహరి, డాక్టర్ సంజయ్, బత్తుల లక్ష్మారెడ్డి, మనోహర్ రెడ్డి, తెల్లం వెంకట్ రావు, నాగరాజు, రేవూరి ప్రకాష్ రెడ్డి, మురళి నాయక్, యశస్విని రెడ్డి, ఎంపీలు కడియం కావ్య, రఘు వీర్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య తదితరులు హాజరయ్యారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





