– ఎన్నుకున్న పార్లమెంట్
టోక్యో, అక్టోబర్ 21: జపాన్ తొలి మహిళా ప్రధానిగా అతివాద నేతగా పేరున్న సనే తకైచి జపాన్ పార్లమెంట్ మంగళవారం ఎన్నుకుంది. పార్టీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రధానిగా ఉన్న షిగెరు ఇషిబా ఇటీవల తన పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధికార లిబరల్ డెమోక్రటిక్ పార్టీ అధ్యక్షురాలిగా సనై తకైచి ఎన్నికయ్యారు. ఇటీవల దేశంలో జరిగిన ఎన్నికల్లో పార్లమెంటు ఎగువ సభలో అధికార పార్టీ మెజారిటీని సాధించలేకపోయింది. దీనికిముందు దిగువ సభలో కూడా మెజారిటీ కోల్పోయింది. దీంతో ఇషిబాపై ఒత్తిడి పెరగ్గా ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఈ క్రమంలోనే పార్టీలో ఎన్నికలు జరగ్గా మాజీ ప్రధాని కుమారుడు షింజిరో కోయిజుమితోపాటు మరో ముగ్గురు అభ్యర్థులను ఓడిరచి తకైచి విజయం సాధించారు. పార్లమెంట్‌లో జరిగిన ఓటింగ్‌లో లిబరల్ డెమోక్రటిక్ పార్టీ` జపాన్ ఇన్నోవేషన్ పార్టీ కూటమితో తకైచికి భారీ మద్దతు లభించింది. దీంతో జపాన్‌కు తొలి మహిళా ప్రధానిగా ఎన్నికై తకైచి అరుదైన ఘనత సాధించారు. 64 ఏళ్ల తకైచి 1993లో స్వస్థలమైన నారా నుంచి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. ఎల్‌డీపీలో ఆర్థిక భద్రత, అంతర్గత వ్యవహారాలు, లింగ సమానత్వ మంత్రితో సహా పలు కీలక పదవుల్లో పనిచేశారు. జపాన్ తొలి మహిళా ప్రధానిగా ఎన్నికైన సానే తకైచికి ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. భారత్`జపాన్‌ల ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి తకైచితో కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండో`పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుల విషయంలో ఇరుదేశాల బంధాలు కీలక పాత్ర పోషిస్తాయన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





