అనూహ్యమైన ప్రగతి

– పనితీరులో దూసుకుపోతున్న హెచ్‌ఎండీఏ

-వేగవంతంగా బిల్డింగ్‌, లేఔట్‌ల అనుమతులు
– రికార్డు స్థాయిలో రూ.1225 కోట్ల ఆదాయం
– గత ఏడాది తో పోలిస్తే 137 శాతం పెరిగిన అనుమతులు
– 9 నెలల్లోనే 88 లక్షల చ.మీకు పైగా బిల్ట్‌ అప్‌ ఏరియాకు అనుమతి
– ఫైళ్ళ పరిష్కారానికి నిరంతర పర్యవేక్షణ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21: నగర విస్తృత అభివృద్ధిలో కీలక భూమిక పోషిస్తున్న హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ(హెచ్‌ఎండిఎ) భవనాలు, బహుళ అంతస్తుల భవనాలు, ఇళ్ల లేఔట్‌లు, విల్లా లేఔట్‌ల అనుమతులలో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది. అనూహ్యమైన ప్రగతి సాధిస్తూ వేగవంతమైన పనితీరుతో ముందుకు దూసుకుపోతోంది. గత సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది మొదటి తొమ్మిది నెలల్లోనే అనుమతుల మంజూరులో కానీ, ఆదాయంలో కానీ అద్భుతమైన పనితీరును ప్రదర్శించి ప్రజల మన్ననలు అందుకుంటోంది. హెచ్‌ఎండీఏ ప్రస్థానంలో ప్రధానమైన అంశం నిర్ధిష్ట కాలపరిమితిలో దరఖాస్తుల పరిష్కారం. ఈ ఏడాది దీనిలో గొప్ప ప్రగతిని సాధించింది. ప్రగతి గురించి కమిషనర్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ ఇలా వివరించారు. 2025 జనవరి నుండి సెప్టెంబర్‌ వరకు చూస్తే తొమ్మిది నెలల్లో 5,499 దరఖస్తులొస్తే 6,079 దరఖాస్తులు పరిష్కరించింది. ఇది 2024లోని మొదటి తొమ్మిది నెలలతో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికం. భవన అనుమతుల కోసం 2,961 దరఖాస్తులు రాగా వీటి సంఖ్య 2024తో పోలిస్తే 18 శాతం, 2023తో పోలిస్తే 8 శాతం పెరిగాయి. వాటిలో 2,904 అంటే 98 శాతానికి పైగా పరిష్కారమయ్యాయి. 2024తో పోలిస్తే 47 శాతం, 2023తో పోలిస్తే 26 శాతం పెరిగాయి. మొత్తం ఈ దరఖాస్తుల ద్వారా 88.15 లక్షల చ.మీకుపైగా బిల్ట్‌ అప్‌ ఏరియాకు అనుమతులు ఇచ్చింది. 2025లో హెచ్‌ఎండీఏ మొత్తం 3,677 కొత్త దరఖాస్తులను స్వీకరించగా వీటిలో బహుళ అంతస్తుల భవనాల (ఎంఎస్బీ) అనుమతులు, ఓపెన్‌ ప్లాట్‌లతో లేఅవుట్‌, గృహాలతో లేఅవుట్‌, భవన నిర్మాణ అనుమతులకు సంబంధించిన దరఖాస్తులు ఉన్నాయి. వాటిలో 2,887 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేసి 79 శాతం ఆమోద రేటును సాధించగా 2024లో 3,209 కొత్త దరఖాస్తులలో 1,216 అనుమతులు ఇచ్చి 38 శాతం ఆమోదం రేటు సాధించింది. 2023లో కొత్త దరఖాస్తులకు అనుమతులను ఇవ్వడంలో 58 శాతం ఆమోద రేటు నమోదైంది. 2023 ముందు కన్నా ఇప్పుడు అనుమతుల మంజూరులో గణనీయమైన వేగాన్ని సాధించగా నిర్మాణదారులకు, ప్రజలకు సంస్థ ఒక నమ్మకాన్ని కలిగించడంతో వారిలో సానుకూల స్పందన వస్తోంది. నిర్దిష్ట కాలపరిమితిలో వివిధ భవనాలు, లేఔట్‌లు, లేఔట్‌ గృహాలు, బహుళ అంతస్తుల భవనాలకు వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడంలో కూడా హెచ్‌ఏండీఏ ఉన్నత ఫలితాలను సాధించింది. 2025 జనవరి నుండి సెప్టెంబర్‌ మధ్య కాలంలో మొత్తం 6,079 ఫైళ్ళు పరిష్కారం కాగా, ఇది 2024తో పోలిస్తే 49 శాతం, 2023తో పోలిస్తే 36 శాతం అధికం అని, ఈ గణాంకాలు సంస్థ నిబద్ధతను ప్రతిబింబిస్తాయని, ఇది పౌరులు, నిర్మాణదారుల, పెట్టుబడిదారుల కోసం విశ్వసనీయమైన వాతావరణాన్ని ఏర్పరుస్తోందని ఆయన తెలిపారు.

పటిష్టమైన పర్యవేక్షణ -జవాబుదారీతనం

ఈ విజయగాధలో కీలకమైనది ఒక పద్ధతి ప్రకారం ఫైళ్లను పరిష్కరిస్తున్న విధానం. ఎప్పటికప్పుడు పరిశీలన, ఇందుకు సంబంధించి ప్రతి అధికారినీ జవాబుదారీ చేయడం, కమిషనర్‌ స్థాయిలో రోజువారీ సమీక్షించడం ముఖ్యమైన అంశాలు. మొత్తం పెండిరగ్‌ ఫైళ్ళను నిర్దిష్ట కాలపరమితి ప్రకారం విభజించి వాటిని పరిశీలించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేశామని కమిషనర్‌ తెలిపారు. 60 రోజులకుపౖౖెగా పెండిరగ్‌, 30నుండి 60 రోజులుగా పెండిరగ్‌, 30 రోజుల లోపు, వారం రోజులుగా పెండిరగ్‌లో ఉన్న ఫైళ్లుగా విభజించుకుని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరించే విధానాన్ని హెచ్‌ఎండీఏ అమలు చేస్తోంది. ఇది మంచి ఫలితాలను ఇస్తోందని కమిషనర్‌ తెలిపారు. 2023 ముందు నాటి పరిస్థితులతో పోలిస్తే పని వేగం పెరగడంతోపాటు, తక్కువ సమయంలో దరఖాస్తులు పరిష్కరించడం, ప్రతి దరఖాస్తుకు తగిన ప్రతిస్పందన ఇచ్చేలా చూడడం, సరైన సమాచారాన్ని తగు రీతిలో పంచుకోవడం వంటి చర్యలు సంస్థ పట్ల ప్రజలలో సంతృప్తి స్థాయిని పెంచిందని తెలిపారు. 30 రోజులకు మించి పెండిరగ్‌లో ఉన్న ఫైళ్లను కఠినమైన మానిటరింగ్‌, నిరంతర ఫాలో-అప్‌ ద్వారా 2 శాతం లోపు తగ్గించగలిగామని, పూర్తిగా పెండిరగ్‌ లేకుండా చేయడానికి మరిన్ని ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వెల్లడిరచారు.

అసాధారణ ఆదాయ వృద్ధి: పట్టణాభివృద్ధికి ఆర్థిక పరిపుష్ఠి

ఈ సంస్కరణల వల్ల ఆర్థికంగా కూడా చాలా సానుకూల ధోరణి కనిపిస్తోంది. 2025 జనవరి నుండి సెప్టెంబర్‌ వరకు 9 నెలల్లో పర్మిట్‌ ఫీజు వసూళ్లు రూ.1,225 కోట్లకు పెరిగాయి, ఇది 2024తో పోలిస్తే 245% (రూ.355 కోట్లు) 2023తో పోలిస్తే 82% (రూ.674 కోట్లు) గణనీయంగా ఎక్కువ. 2025లో నెలవారీ ఆదాయం 2024, 2023 నెలల సంబంధిత నెలల్లో నెలవారీ ఆదాయం కంటే ఎక్కువగా ఉంది. 2025 సెప్టెంబర్‌లో మాత్రమే ఆదాయ వసూళ్లు రూ.132 కోట్లు, ఇది సెప్టెంబర్‌ 2024 నుండి 263% పెరుగుదల. ఇది మౌలిక సదుపాయాలు పెంచడంతో పాటు, వనరుల సమీకరణ, మెరుగైన ప్రజా సేవలకు అద్దం పడుతోంది. 2025 మొదటి తొమ్మిది నెలలు బహుళ అంతస్తుల భవనాల అనుమతుల పరంగా చూస్తే అసాధారణమైన ప్రగతి సాధించమని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ కాలంలో మొత్తం 77 దరఖాస్తులకు అనుమతులు మంజూరు చేశామని, వీటి ద్వారా 78.71 లక్షల చ.మీ విస్తీర్ణంలో నిర్మాణాలకు అనుమతి లభించగా, రూ.514 కోట్ల ఆదాయాన్ని రికార్డు స్థాయిలో సాధించగలిగామని చెప్పారు. ఇదే కాలంలో 2023లో కేవలం 55 దరఖాస్తులు మాత్రమే మంజూరు కాగా అప్పుడు నిర్మాణ విస్తీర్ణం 37.03 లక్షల చదరపు మీటర్లు.. ఆదాయం రూ.215 కోట్లుగా నమోదైంది. ఈ ఏడాది వృద్ధి గణనీయమైనదిగా నిలిచిందని ఆయన వెల్లడిరచారు. హైదరాబాద్‌ నగర విస్తరణలో భాగంగా గండిపేట్‌ మండల పరిధిలోని కొన్ని కీలక ప్రాంతాల్లో హెచ్‌ఎండీఏ భారీ మల్టీ-స్టోరీడ్‌ నిర్మాణాలకు ఇటీవల కాలంలో కొన్ని అనుమతులు మంజూరు చేసింది. ఈ ప్రాజెక్టులు నగర రూపురేఖలను మరచేలా కీలకంగా నిలుస్తున్నాయి. ఉదాహరణకు కొకాపేట్‌లో 2.17 ఎకరాల విస్తీర్ణంలో ఒక బ్లాక్‌ నిర్మాణానికి అనుమతి లభించింది. ఇది 5 సెల్లార్లు, గ్రౌండ్‌, 63 అంతస్తులు కలిగి ఉంటుంది. నిర్మాణ విస్తీర్ణం 15,45,994 చ.అ. యూనిట్లు 362. అదే కొకాపేట్‌లో మరో ప్రాజెక్టు 7.71 ఎకరాలు, 5 బ్లాకులు, ప్రతి బ్లాక్‌ 4 సెల్లారు, గ్రౌండ్‌, 56 అంతస్తులు. నిర్మాణ విస్తీర్ణం 55,44,206 చ.అ కాగా యూనిట్లు 656. బండ్లగూడ జాగీర్‌లో 3.22 ఎకరాల ప్రాజెక్టులో 2 బ్లాకులు, 3 సెల్లార్లు, స్టిల్ట్‌, 30 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 15,03,090 చ.అ కాగా 446 యూనిట్లు, అదే బండ్లగూడ జాగీర్‌లో 2.34 ఎకరాల ప్రాజెక్టు 1 బ్లాక్‌, 2 సెల్లార్లు, 5 పొడియం, 47 అంతస్తులు, నిర్మాణ విస్తీర్ణం 13,51,476 చ.అ కాగా 344యూనిట్లు. కొకాపేట్‌లో మరో ప్రధాన ప్రాల్ణజెక్టు 9.71 ఎకరాలు, 3 బ్లాకులు. ఇందులో 2 రెసిడెన్షియల్‌ బ్లాకులు (5 సెల్లార్లు, గ్రౌండ్‌, 57 అంతస్తులు), 1 కమర్షియల్‌ బ్లాక్‌ (5 సెల్లార్లు, గ్రౌండ్‌, 49 అంతస్తులు) ఉన్నాయి. మొత్తం నిర్మాణ విస్తీర్ణం 66,03,556 చ.అ కాగా 594 యూనిట్లు. ఈ ప్రాజెక్టులు హైదరాబాద్‌ నగరానికి కొత్త ఆకృతి, ఆధునికత, ఆకాశాన్ని తాకే నిర్మాణ శైలిని అందిస్తున్నాయి. అనుమతులు, ఆదాయ పరంగా గత రెండేళ్లల్లో హెచ్‌ఎండీఏ ప్రగతి రెట్టింపు స్థాయికి చేరింది. ఇది పెరుగుతున్న డిమాండ్‌ను, హెచ్‌ఎండీఏ పారదర్శక విధానాలపై ప్రజల విశ్వాసాన్ని, అభివృద్ధి ప్రాజెక్టుల క్లియరెన్స్‌లో ఉన్న వేగాన్ని ప్రతిబింబిస్తోందని కమిషనర్‌ సర్ఫరాజ్‌ తెలిపారు. ఓపెన్‌ ప్లాట్‌లకు మంజూరైన లేఅవుట్‌ అనుమతులు 2,862 ఎకరాలను కవర్‌ చేశాయని ఇది 2024తో పోల్చితే 512% వృద్ధి అని, హౌసింగ్‌తో కూడిన లేఅవుట్లు 38.24 లక్షల చ.మీ విస్తీర్ణాన్ని చేరాయని (2024తో పోల్చితే 186% వృద్ధి) తెలిపారు. బిల్డింగ్‌ అనుమతులు 88.15 లక్షల చ.మీ అభివృద్ధికి లభించగా 2024తో పోల్చితే 239%, 2023తో పోల్చితే 87% ఎక్కువ. ఈ అసాధారణ ఆదాయ వనరులు హైదరాబాద్‌ నగర ప్రణాళికకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. రోడ్లు, ప్రజా సౌకర్యాలు, పచ్చదన ప్రదేశాలకు ఇది కొత్త శక్తినిస్తోంది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page