– ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళి
దిల్లీ, ప్రజాతంత్ర, జూలై 28 : రాజకీయాల్లో నైతికతకు ప్రతీక కేంద్ర మాజీ మంత్రి ఎస్.జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి కొనియాడారు. జైపాల్ రెడ్డి వర్ధంతిని పురస్కరించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఆయన చిత్రపటానికి మంగళవారం పూలమాల వేసి నివాళులర్పించారు. విద్యార్థి నాయకునిగా ప్రస్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి తన తుది శ్వాస వరకు విలువలు, సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. తన విషయ పరిజ్ఞానం, వాగ్ధాటితో అటు ప్రజలు, ఇటు పార్లమెంటులో తనదైన ముద్ర వేసిన ఘనత జైపాల్ రెడ్డిదని తెలిపారు. ఆయన ఆశయాలను రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుందని సీఎం తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, కాంగ్రెస్ నేతలు రోహిణ్ రెడ్డి, తుమ్మల యుగంధర్ పాల్గొన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




