హెటెరోతో ఇంటర్ విద్యా శాఖ ఎంవోయూ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 22 : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించి, ఉపాధి అవకాశాలను మెరుగుపరిచే లక్ష్యంతో హెటెరో ఫార్మాస్యూటికల్స్ సంస్థతో రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యాశాఖ అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ ఒప్పంద మార్పిడి కార్యక్రమం ఇంటర్మీడియట్ విద్యా శాఖ డైరెక్టర్ అభిలాష అభినవ్ జాయింట్ డైరెక్టర్ యెంక్యా నాయక్, రాష్ట్ర వృత్తి విద్యా సంస్థ (ఎసఐవీఈ) ప్రిన్సిపాల్ డాక్టర్ జ్యోత్స్నారాణి, హెటెరో సంస్థ ప్రతినిధులు డాక్టర్ ఎస్.వెంకట జయపాల్ రెడ్డి(వైస్ ప్రెసిడెంట్-హెచఆర్), మాధురి ఐ.(సీనియర్ మేనేజర్-హెచఆర్), కర్ణకంటి వేణుమాధవ్ (ఆఫీసర్-హెచఆర్) సమక్షంలో జరిగింది. ఈ భాగస్వామ్యం ద్వారా హెటెరో పరిశ్రమలతో పరస్పర అనుసంధానం, క్యాంపస్ నియామకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలు, ఇంటర్న్‌షిప్‌లు, అధ్యాపకులకు పరిశ్రమల పరిచయం, సీఎసఆర్ కార్యక్రమాల కింద ప్రయోగశాలల అభివృద్ధి, > ముఖ్యంగా లైఫ్ సైన్సెస్, అనుబంధ విభాగాల్లో చదువుతున్న ఇంటర్, వృత్తి విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించనుంది. ఈ సందర్భంగా అభిలాష అభినవ్ మాట్లాడుతూ విద్యార్థులకు సార్థకమైన వృత్తి అవకాశాలు కల్పించాలనే తమ నిబద్ధతకు ఈ భాగస్వామ్యం నిదర్శనమన్నారు. హెటెరోతో కలిసి పనిచేయడం ద్వారా ఫార్మాస్యూటికల్ రంగానికి అవసరమైన శిక్షణతోపాటు, దీర్ఘకాలిక, స్థిరమైన ఉపాధి అవకాశాలను యువతకు అందిస్తున్నామన్నారు. డాక్టర్ వెంకట జయపాల్ రెడ్డి మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యాశాఖతో తమ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం పట్ల తాము గర్విస్తున్నామన్నారు. ఇంటర్మీడియట్ అర్హత కలిగిన యువతకు 300మందికి పైగా ఉపాధి అవకాశాలు కల్పించడం ద్వారా రాష్ట్ర యువత ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించే ప్రభుత్వ లక్ష్యానికి తాము తోడ్పడుతున్నామని చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *