హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల ఫీజు గడువును ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరానికి చెందిన రెగ్యులర్ విద్యార్థులతోపాటు, ఫెయిలైన విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్షలు రాయడానికి ఫీజు చెల్లింపు గడువును ఈనెల 23వ తేదీ వరకు పొడిగించినట్లు బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి నిర్వహించిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలు ఈనెల 12న విడుదలయ్యాయి. కాగా, ఈ పరీక్షలో ఉత్తీర్ణులై మార్కులు ఎక్కువ సాధించాలని భావించే విద్యార్థులు, ఫెయిలైన విద్యారులకు మే 13 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. మే 22 నుంచి 25 వరకు ప్రాక్టికల్స్, 26న ఫస్టియర్, సెకండియర్ ఇంగ్లీష్ ప్రాక్టికల్స్, 28న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష, ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్ష నిర్వహించనున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



