– కాళేశ్వరంపై న్యాయవాదులతో సంప్రదింపులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 20: బీఆ ర్ ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ త్రిసభ్య కమిటీ దిల్లీ పర్యటనకు వెళ్లింది. ఈ ప్రతినిధుల బృందంలో మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ ఎంపీ వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారు. ఈనెల 22న తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై తుది తీర్పు వెలువడనుంది. అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు దిల్లీ వెళ్లారు. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైంది. కాళేశ్వరం కమిషన్‌పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై న్యాయవాదులతో చర్చిస్తున్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



