– ప్రతి కుటుంబం ఆర్థికంగా బలోపేతం కావాలి
– రెవెన్యూ మంత్రి పొంగులేటి వెల్లడి
ఖమ్మం, ప్రజాతంత్ర,ఆ గస్టు 19 : గ్రామీణ ప్రజలకు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ప్రజా ప్రభుత్వం నిరంతరం పనిచేస్తోందని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కోట్లాది నిధులను కేటాయిస్తూ పల్లెల ప్రగతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. లేరు నియోజకవర్గంలో పర్యటనలో భాగంగా కూసుమంచి మండలం క్యాంప్ కార్యాలయంలో అర్హులైన 12 మంది దివ్యాంగులకు వంద శాతం సబ్సిడీపై మూడు చక్రాల మోటార్ వాహనాలను బుధవారం పంపిణీ చేశారు. అనంతరం ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంలో రూ. 20లక్షలతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని ప్రారంభించి అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. రూ.61.76 కోట్లతో ప్లలెగూడెంలో సీసీ, బీటీ రోడ్లతోపాటు వివిధ అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పల్లెగూడెంలో ప్రభుత్వ మరియు అసైన్డ్ భూములను ఆక్రమించిన వారి నుంచి వెంటనే స్వాధీనం చేసుకుని, గ్రామంలోని అర్హులైన నిరుపేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలుగా కేటాయించాలి. ప్రభుత్వ భూముల ఆక్రమణలపై క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ జరిపి, వెంటనే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అదేవిధంగా గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు రూ.12 లక్షల నూతన అంగన్‌వాడీ భవనాన్ని కూడా తక్షణమే మంజూరు చేశారు. ఈ సందర్భంగా సభలో పింఛన్లు కావాలని అడిగిన మహిళలకు నెల 31లోగా అర్హులైన వయోవృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు దరఖాస్తు చేసుకోవాలని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వానివి కుట్రపూరిత రాజకీయాలు
– ఎస్‌ఐఆర్ పేరుతో భారీగా వోట్ల తొలగింపు
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్య వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని మంత్రి పొంగులేటి ఆరోపించారు. ఎస్‌ఐఆర్ అనే పక్రియను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న బిఆర్‌ఎస్ పార్టీతో కలిసి భాజపా కుట్రలు చేస్తోందన్నారు. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు ఎస్‌ఐఆర్ అనే భూతాన్ని చూపి భారీగావోట్ల తొలగింపుకు తెరలేపిందన్నారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన పీఏసీ సమావేశంలో ఎఐససి కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల కో ఇన్చార్జి సచిన్ సావంత్, ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి, జిల్లా డిసిసి అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, వైరా శాసనసభ్యులు మాలోతు రాందాస్ నాయక్ ,పార్టీ ముఖ్య నాయకులతో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివసా రెడ్డి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా స్థానిక రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ పార్టీకి అండగా నిలిచే దళిత, గిరిజన, మైనారిటీ వర్గాల వోట్లే లక్ష్యంగా సుమారు 67 నుంచి 68 లక్షల వోట్లను తొలగించేందుకు శ్రీకారం చుట్టడమే కాకుండా, మరో 70 లక్షల వోట్లను గాలిలో పెట్టి వోటర్లను గందరగోళానికి గురిచేస్తున్నారు. కుట్రలను తిప్పికొట్టేందుకు రాబోయే 4-5 రోజుల్లో బూత్ స్థాయి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు




