మాజీ ఎమ్మెల్యే కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు

– ఉత్తర్వుల ప్రతులు అందజేసిన కలెక్టర్ పవార్

సూర్యాపేట, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17: సూర్యాపేట నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ప్రజా ఉద్యమ నాయకుడు ఉప్పల మల్పూర్ కు ఇందిరమ్మ ఇల్లు మంజూరు అయింది. ఆయన కుటుంబ పరిస్థితులపై వచ్చిన వార్తలను పరిశీలించిన కలెక్టర్ తేజస్ నంద్లల్ పవార్ మోతె మండలం సిరికొండ గ్రామంలోని మల్సూర్ కుటుంబాన్ని గురువారం స్వయంగా సందర్శించారు. మల్సూర్ ఇంటిని, అక్కడి పరిస్థితులను పరిశీలించిన కలెక్టర్ కుటుంబ సభ్యులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. మల్పూర్ కోడళ్లు పుష్పలత, యశోదలకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తూ జారీ చేసిన ప్రొసీడింగ్స్ ప్రతులను కలెక్టర్ స్వయంగా అందజేశారు. కుటుంబ సభ్యుల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించిన అనంతరం వారి అర్హతల మేరకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

అంగన్ వాడీ కేంద్రం మరమ్మతులకు రూ.3 లక్షలు

అనంతరం సిరికొండలోని అంగన్వాడీ కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు. భవనం మరమ్మతుల కోసం రూ.3 లక్షలు కేటాయిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించేలా చర్యలు చేపట్టాలని అధి కారులను ఆదేశించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంకన్న, ఎంపీడీవో సందీప్కుమార్, హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *