ఓటర్ల నోటీసుల పరిష్కారం మరింత సులభతరం

హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 17 : ‘సర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందించిన నోటీసుల పరిష్కార ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం మరింత సులభతరం చేసింది. ఇప్పటి వరకు ఓటర్ల కు అందించిన నోటీసులను పరిష్కరించేందుకు సంబంధిత ఓటరు కుటుంబ సభ్యులలో ఎవరైనా ఒకరు ఇఆర్ఒ/ఎఇఆర్ఒల ఎదుట వ్యక్తిగతంగా హాజరై తమ కుటుంబ సభ్యులకు సంబంధించిన అవసరమైన పత్రాలు, అవసరమై సమాచారాన్నిఅందించేందుకు అవకాశం కల్పించిన‌ట్లు సీఈవో సుదర్శన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరుకు సంబంధించిన పత్రాలను స్వీకరించి జారీ చేసిన నోటీసుల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇప్పటికే జిల్లా ఎన్నికల అధికారులకు దీనికి సంబంధించిన సమాచారాన్ని అందించామని, దానికి అనుగుణంగా  ఓటర్లకు ఇచ్చిన నోటీసులను పరిశీలించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. అదేవిధంగా ఫారం-6కు సంబంధించిన దరఖాస్తుల పరిశీలన, డిక్లరేషన్ ఫారం స్వీకరణ, క్లెయిమ్ ల పరిష్కార ప్రక్రియలో భాగంగా అర్హత తేదీ 1.10.2026 పరిగణిస్తూ ఇప్పటివరకు పెండింగ్ లో ఉన్న ఫారం-6 దరఖాస్తులకు, అలాగే భవిష్యత్తులో అందే ఫారం-6 దరఖాస్తులకు సంబంధించి నిర్దేశిత డిక్లరేషన్ ఫారాన్ని తప్పనిసరిగా స్వీకరించాలని కూడా ఆదేశించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియ భారత ఎన్నికల సంఘం నిబంధనలకు అనుగుణంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
——————————————————————————————————————————————————————

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *