– పార్కులకు విముక్తి కలిగించినట్లు వెల్లడి
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15: హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ పరిధిలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది. బద్వేల్-ఉప్పరపల్లి గ్రామాల్లో జనచైతన్య లేఔట్ ఫేజ్ 1, 2లో కబ్జాకు గురైన 4 పార్కులకు విముక్తి కల్పించింది. 19,878 గజాల భూమిని ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుంది. దీని విలువ రూ.139 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. దాదాపు 120 ఎకరాల్లో ఫేజ్ 1, 2 హుడా అప్రూవల్ పేరుతో ఏర్పాటు చేసిన లేఔట్‌లో పార్కులు కబ్జాకు గురవుతున్నాయని హైడ్రా ప్రజావాణికి ఫిర్యాదులు అందాయి. రెవెన్యూ, మున్సిపల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కబ్జా జరిగినట్లు నిర్ధరించారు. ఈ క్రమంలో బుధవారం ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. ప్రహరీలు నిర్మించుకుని వేసిన షెడ్‌లు, రూమ్‌లను తొలగించారు. అనంతరం ఫెన్సింగ్ నిర్మాణ పనులు చేపట్టారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





