– ఓటమి భయంతోనే ..
– మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్,ప్రజాతంత్ర,అక్టోబర్15: జూబ్లీహిల్స్‌లో ఓటమి భయంతో బిఆర్‌ఎస్ రకరకాల ప్రచారాలు చేస్తోందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.దేశంలో వోట్ల చోరీ జరిగిందని చెప్పిందే కాంగ్రెస్ అని గుర్తుచేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓడిపోతామనే బీఆర్‌ఎస్ నేతలు సాకులు వెతుకుతున్నారని విమర్శించారు. వోటర్ల జాబితా తయారు చేసిందే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వమని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానిది రామరాజ్యమని అభివర్ణించారు. తెలంగాణలోని ప్రజలందరూ రామరాజ్యాన్ని కోరుకుంటున్నారని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇదిలావుంటే మంత్రుల మధ్య వివాదాలపై మంత్రి శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. మంత్రుల మధ్య వివాదాలు లేవని స్పష్టం చేశారు. తాను సీనియర్ కాంగ్రెస్ వాదినని చెప్పుకొచ్చారు. తనకి నీచ రాజకీయం చేసే శక్తి లేదు.. యుక్తి అంతకన్నా లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను పార్టీని నమ్ముకొని ఉన్నానని క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లో బుధవారం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. పార్టీని నమ్ముకోకుండా అటు, ఇటు పోయే వ్యక్తిని తాను కాదని స్పష్టం చేశారు. తాను పార్టీని బలోపేతం చేసే వ్యక్తినని చెప్పుకొచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





