– బీసీ జేఏసీ బంద్‌కు బీజేపీ మద్దతు
– పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 15: బీసీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో వివిధ కుల సంఘాలు, బీసీ సంఘాల ప్రతినిధులు కలిసి శనివారం తలపెట్టిన బంద్‌కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నదని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు తెలిపారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ జేఏసీ నాయకులు బుధవారం బీజేపీ కార్యాలయానికి వచ్చి రామచందర్‌రావును కలిశారు. బీసీల హక్కుల కోసం కృష్ణయ్య సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారని, బీసీ సమాజ అభ్యున్నతికి ఆయన చేసిన కృషిని తాము అభినందిస్తున్నామని అన్నారు. బీజేపీ మాత్రమే బీసీలకు న్యాయం చేయగలిగిన పార్టీ అని స్పష్టం చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ చేసి హామీలు ఇచ్చిన కాంగ్రెస్ తాను చేయలేని పనిని ఇప్పుడు ఇతరులపై మోపుతోందని విమర్శించారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 27మంది బీసీ మంత్రులు ఉన్నారుని, ఇది బీసీలకు పార్టీ ఇచ్చే ప్రాధాన్యతకు నిదర్శనమని తెలిపారు. కులగణన బీసీల చరిత్రాత్మక విజయం అని, 1931 తర్వాత మొదటిసారిగా కులగణన చేపట్టడం బీజేపీ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని ఆయన అన్నారు. రిజర్వేషన్ల విషయంలో హైకోర్టు స్టే ఇచ్చినప్పుడు బీసీల వాదనలు వినకపోవడం పట్ల ఆ సమాజం ఆగ్రహంగా ఉందన్నారు. ఈ పరిస్థితులకు కారణం కాంగ్రెస్ పార్టీ చూపిన నిర్లక్ష్యమేనని రామచందర్‌రావు విమర్శించారు. కృష్ణయ్య, ఇతర కుల సంఘాలు రిజర్వేషన్ల పిటిషన్‌లలో ఇంప్లీడ్ అయినా వాటిని పట్టించుకోలేదన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు బంద్‌కు మద్దతు ఇవ్వాలని, చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. బీసీలకు న్యాయం జరిగే వరకు ఈ పోరాటం కొనసాగుతుందన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





