– ఐటీ మంత్రిగా అత్యంత గర్వించదగిన క్షణాలలో ఇది ఒకటి
– మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో ఐటీ శాఖ మంత్రిగా తాను చేసిన ఇష్టమైన కార్యక్రమాల్లో టీ-హబ్ ఏర్పాటు ఒకటి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా అయిన కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌ను స్టార్టప్ కేపిటల్ ఆఫ్ ఇండియాగా టీ-హబ్ మార్చిందన్నారు. .టీ-హబ్ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. నవంబర్ 5, 2015న టీ-హబ్ స్థాపన దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటూ టీ-హబ్ వల్ల భారత దేశంలోని స్టార్టప్ ఎకోసిస్టమ్‌లో అగ్రగామిగా తెలంగాణ ఎదగడానికి పునాది వేసిందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ దూరదృష్టి గల నాయకత్వంలో, తాము ఒక సమగ్రమైన ఆవిష్కరణల వ్యవస్థను (ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను) నిర్మించామని, ఇది హైదరాబాద్‌ను భారతదేశపు స్టార్టప్ రాజధానిగా మార్చిందని తెలిపారు. ఒక సమగ్రమైన ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను ఏర్పాటు చేసే లక్ష్యంతో తాము చేపట్టిన విజన్‌లో టీ-హబ్ కేవలం మొదటి అడుగు మాత్రమేనంటూ దాని తర్వాత వీ-హబ్(We-Hub), తెలంగాణ రాష్ట్ర ఇన్నోవేషన్ సెల్ (TSIC), టీ-వర్క్స్ (T-Works), తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (TASK), ఎమర్జింగ్ టెక్నాలజీస్ వింగ్, రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (RICH) వంటి సంస్థలను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. ఇవన్నీ తెలంగాణ ఇన్నోవేషన్ వ్యవస్థను సాటిలేనిదిగా తయారు చేశాయన్నారు. టీ-హబ్ ఏర్పాటు రోజున రతన్ టాటా టీ-హబ్ ఆధునిక భారత దేశ ముఖచిత్రంగా నిలుస్తుంది అని చెప్పిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక విశాలమైన, విస్తృతమైన విజన్ పునాదిగా ఒక చిన్న ఇంక్యుబేటర్‌గా ప్రారంభమై, ప్రస్తుత స్థాయికి టీ-హబ్ ఎదగడం ఒక గొప్ప ప్రయాణం అన్నారు. గత దశాబ్దంలో టీ-హబ్ సాధించిన విజయం ఐటీ మంత్రిగా తనకు అత్యంత గర్వించదగిన క్షణాలలో ఒకటి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. అనేక ఆవిష్కరణలను నడిపిస్తూ వందలాది టెక్ స్టార్టప్‌లు వాటి పూర్తి సామర్థ్యాన్ని చేరుకోవడానికి స్ఫూర్తిని, బలాన్ని ఇస్తున్న టీ-హబ్‌ను, దాని ప్రస్థానాన్ని అభినందిస్తున్నానన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





