– పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల అభినందనలు
హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 5: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పభుత్వం కేటాయించిన సచివాలయం గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఛాంబర్‌లో వేద పండితుల ఆశీర్వచనాల మధ్య, కుటుంబ సభ్యులు, అధికారుల సమక్షంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సుదర్శన్ రెడ్డికి అభినందనలు తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్ నుంచి మంత్రి పదవిని ఆశించిన సుదర్శన్ రెడ్డికి వివిధ సమీకరణల నేపథ్యంలో మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కానందున సీఎం రేవంత్ రెడ్డి అధిష్ఠానం సూచనల మేరకు ఆయనను బుజ్జగించి కేబినెట్ హోదాలో ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. అలాగే కేబినెట్ బెర్త్ కోరుకున్న ఉమ్మడి అదిలాబాద్ జిల్లా సీనియర్ ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు కూడా కేబినెట్ హోదాతో రాష్ట్ర సివిల్ సఫ్లయ్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కట్టబెట్టిన విషయం విదితమే.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





