బక్రీద్ సెలవు 28కి మార్పు

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23 : తెలుగు రాష్ట్రాల్లో బక్రీద్(ఈద్ అల్-అధా) పండుగ తేదీ మారింది. దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఆలస్యం కావడంతో ఈనెల 28న బక్రీద్ సెలవు దినంగా ప్రకటిస్తూ ప్రభుత్వాలు ఉత్తర్వులు జారీ చేశాయి. దీంతో ఆ రోజున అన్ని ప్రభుత్వ కార్యాలయాలు సహా విద్యాసంస్థలు, బ్యాంకులకు సెలవు ఉండనుంది. అయితే చంద్రుని దర్శనం ఆధారంగా సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో మాత్రం ఈ నెల 27న ఈ పండుగను జరుపుకోనున్నారు. తొలుత ప్రకటించిన దాని ప్రకారం 27న ఉండగా దానిని 28 గురువారం నాటికి మారుస్తూ రెండు తెలుగు రాష్ట్రాలు అధికారిక ఉత్తర్వులు జారీ చేశాయి. వాస్తవానికి ముస్లింలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే పవిత్రమైన పండుగ బక్రీద్ ఇస్లామిక్ క్యాలెండర్‌లోని చివరి నెల అయిన దుల్-హిజ్జా 10వ రోజు వస్తుంది. ఆ ప్రకారం ముస్లిం పండుగలు చంద్ర దర్శనంపై ఆధారపడి ఉంటాయి. అయితే ఈసారి దుల్ హిజ్జా నెలవంక దర్శనం ఒక రోజు ఆలస్యం కావడంతో పండుగ తేదీ మారినట్టు మత పెద్దలు ప్రకటించారు.
తెలంగాణ వక్ఫ్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మైనారిటీ సంక్షేమ శాఖల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, సిఫార్సులను పరిశీలించిన ప్రభుత్వం పండుగ సెలవును 28కి మార్చింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *