హైదరాబాద్ కు.. సిడ్నీ కాల్పుల‌కు సంబంధం లేదు

హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 19: ఆస్ట్రేలియాలోని బోండి బీచ్ లో ఇటీవల జరిగిన కాల్పుల ఘటనకు, హైదరాబాద్ కు ఎటువంటి సంబంధం లేదని డీజీపీ శివధర్ రెడ్డి తేల్చి చెప్పారు. నిందితుడు సాజిద్ అక్రమ్ నగరాని కి చెందినవాడు అయినప్పటికీ హైదరాబాద్ నగరంతో సంబంధం లేదన్నారు. సాజిద్ అక్రమ్ 1998లో ఉపాధి కోసం ఆస్ట్రేలియాకు వెళ్లాడని, అప్పటి నుండి అతను ఆరుసార్లు మాత్రమే భారత దేశానికి తిరిగి వచ్చాడని డీజీపీ తెలిపారు. ఆస్ట్రేలియాలో ఒక యూరోపియన్ మహిళను వివాహం చేసుకున్న తర్వాత అతను 1998లో ఒకసారి ఆమెతో కలిసి హైదరాబాద్ వచ్చాడన్నారు. 2011 జూబ్లీ ప్రాపర్టీ సెటిల్మెంట్ ఇంకోసారి వచ్చాడని, 2016 మరోసారి ప్రాపర్టీ సెటిల్మెంట్ కోసం ఇక్కడికి వచ్చాడని చెప్పు కొచ్చారు. 2022 తల్లి, సోదరిని చూసేందుకు నగరానికి వచ్చాడని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page