హోటళ్లు, రెస్టారెంట్ల రేపు రాత్రి 12తర్వాతా ప‌నిచేస్తాయి

– ‘ఫిఫా’ ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు అనుమ‌తి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 18 : హైదరాబాద్ నగరంలోని వేలాదిమంది ఫుట్‌బాల్ అభిమానుల విజ్ఞప్తి మేరకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్జెంటీనా-స్పెయిన్ మధ్య ఆదివారం జరగనున్న ఫిఫా వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్‌ను ప్రత్యక్ష ప్రసారం చేసే హోటళ్లు, రెస్టారెంట్లు, పబ్‌లు, ఇతర సంస్థలకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఆదివారం అర్ధరాత్రి తర్వాత 12.30 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. సోమవారం తెల్లవారుజామున ముగిసే వరకు మ్యాచ్‌ను వీక్షించేందుకు అనుమతించింది. ఈ సడలింపులతోపాటు నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అమలు చేసే భద్రతా నిబంధనలను పోలీస్, ట్రాఫిక్ అధికారులు యథాతథంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోనున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *