జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటన

– ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కమిటీ కుర్రోళ్లు ఎంపిక
– విజువల్‌ ‌వండర్‌ ‘‌కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులు
న్యూదిల్లీ,జూలై18:72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో తెలుగు చిత్రాలు అదరగొట్టాయి. 2024 సంవత్సరానికి గానూ వివిధ కేటగిరీల్లో పలు తెలుగు చిత్రాలకు అవార్డులు దక్కాయి. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ’కమిటీ కుర్రోళ్ళు’ ఎంపికైంది. అంతేకాదు, ఉత్తమ మేకప్‌ ‌విభాగంలోనూ అవార్డు వరించింది. కొత్త నటులతో దర్శకుడు యదువంశీ రూపొందించి ఈ చిత్రానికి మెగా డాటర్‌ ‌నిహారిక కొణిదెల నిర్మాతగా వ్యవహరించడం విశేషం. బాక్సాఫీస్‌తో పాటు ఓటీటీలోనూ అదరగొట్టిన ఈ మూవీ ఇప్పుడు ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన గద్దర్‌ అవార్డుల్లో జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాల సామాజిక అభ్యున్నతికి ఉద్దేశించిన చిత్రంగా వివిధ విభాగాల్లో మెరిసింది. ఇక నాగ్‌ అశ్విన్‌ ‌విజువల్‌ ‌వండర్‌ ’‌కల్కి 2898 ఏడీ’కి రెండు కేటగిరీల్లో అవార్డులను దక్కించుకుంది. అద్భుతమైన సెట్స్, ‌విజువల్స్‌తో అలరించినందుకు ఉత్తమ ప్రొడక్షన్‌ ‌డిజైన్‌ అవార్డుతో పాటు, ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. ’ఎంత గొప్పగా ఆడావు అన్నది ముఖ్యం కాదు.. ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం, ’ఒక్క రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికి జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా’ వంటి సంభాషణలతో అలరించిన చిత్రం ’లక్కీ భాస్కర్‌’. ఇలాంటి అద్భుతమైన సంభాషణలను రాసి జీవిత సత్యాలెన్నో చెప్పిన దర్శకుడు వెంకీ అట్లూరి ఉత్తమ రచయితగా జాతీయ అవార్డు దక్కింది. మాస్‌నే కాదు, బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసిన చిత్రం ’పుష్ప2’. ఇప్పుడు ఏకంగా రెండు జాతీయ అవార్డులను సొంతం చేసుకుంది. ఈ మూవీని ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన దర్శకుడు సుకుమార్‌ ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత కేటగిరిలో అవార్డుకు ఎంపిక కాగా, ఉత్తమ కాస్ట్యూమ్‌ ‌డిజైనర్‌గా దీపాలి నూర్‌, ‌సీతల్‌ ‌శర్మలకు అవార్డు దక్కింది. చిన్న చిత్రం కాదు.. ప్రతి ఒక్కరి మనుసుల్ని హత్తుకునేంత పెద్ద చిత్రమనించింది ’35- చిన్న కథ కాదు’. ఇప్పుడు జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలల చిత్రంతో పాటు, ఉత్తమ బాల నటుడిగా అరుణ్‌దేవ్‌ ‌పోతుల అవార్డుకు ఎంపికయ్యారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌ డేట్స్  కోసం  మా  X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..  మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *