– బుల్లెట్ ట్రైన్ కోసం భూ సేకరణ.. అధికారులపై రైతుల మండిపాటు
– భూముల జోలికి వస్తే ఊరుకోబోమని హెచ్చరిక
– ఐదు రోజులుగా కొనసాగుతున్న ఆందోళన
రంగారెడ్డి, ప్రజాతంత్ర, జూలై 18: శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో ఉద్రిక్తత నెలకొంది. బుల్లెట్ ట్రైన్ కోసం భూములు ఇచ్చేందుకు రైతులు నిరాకరిస్తున్నారు. బహదూర్ గూడా భూముల దగ్గరకు హైడ్రా అధికారులు భారీగా చేరుకున్నారు. భూముల వ్యవహారంలో ఐదు రోజులుగా రైతుల ఆందోళన కొనసాగుతోంది. స్పష్టమైన హామీ ఇచ్చాకే భూములు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో..బహదూర్‌గూడ భూముల జోలికొస్తే ఖబడ్దార్ అంటూ రాజేంద్రనగర్ నియోజకవర్గం బీఆర్‌ఎస్ ఇన్‌చార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి హెచ్చరించారు. హైడ్రా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజల కోసం పనిచేస్తుందని అనుకున్నాం. కానీ మీరు బ్లాక్ మెయిలర్‌లు.. ప్రజలను భయపెట్టడానికి వచ్చిన హైడ్రా అంటూ విరుచుకుపడ్డారు. బహదూర్‌గూడా భూములపై స్టేటస్‌కో ఉన్నందున జిల్లా కలెక్టర్ కోర్టు అనుమతి లేకుండా భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదని, ప్రజాక్షేత్రంలో నిలబెడతామని హెచ్చరించారు. బహదూర్‌గూడలో చేపట్టిన రైతు నిరసన ఐదో రోజుకు చేరింది. రైతులకు ఈరోజు మద్దతుగా కార్తీక్ రెడ్డి నిలబడ్డారు. బహదూర్‌గూడలోని వ్యవసాయ పొలాలను తరతరాలుగా సాగు చేసుకుంటూ వస్తున్న ప్రజల నుంచి బులెట్ ట్రైన్ పేరుతో లాక్కోవాలని చూస్తున్నది.. కానీ ముమ్మాటికి రైతుల పక్షాన ఉండి పోరాడతాం.. ఎక్కడికైనా వెళతాం కానీ రైతుల భూములను ఇచ్చే ప్రసక్తి లేదంటూ ప్రభుత్వానికి సవాల్ విసిరారు. రైతులను పిలిచి బెదిరించి భూములను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసింది. కానీ బీఆర్‌ఎస్ పార్టీ రైతుల పక్షాన నిలబడుతుందని, ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్ల తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రాబోతుంది కాబట్టి బహదూర్‌గూడ రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆందోళన చెందొద్దని, అందరికీ ఆయన చేతుల మీ దుగా పట్టా, పాసు పుస్తకాలు ఇప్పిస్తామని కార్తీక్ హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు



