– అలర్ట్ వ్యవస్థ సమర్థత పరీక్షించేందుకు
– ఎవరూ భయపడనవసరం లేదు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 1 : నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ ఈనెల 2వ తేదీ(శనివారం) దేశవ్యాప్తంగా సెల్ బ్రాడ్‌కాస్ట్ అలర్ట్ వ్యవస్థపై పరీక్ష నిర్వహించనున్నారు. ఈ పరీక్ష దిల్లీ ఎన్‌సీఆర్, అన్ని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల రాజధాని నగరాలను కవర్ చేయనుంది. అయితే సరిహద్దు ప్రాంతాలు, ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాలను ఈ పరీక్షకు మినహాయింపు ఇచ్చారు. ఈ పరీక్ష సమయంలో పౌరులు తమ మొబైల్ ఫోన్లలో అత్యవసర అలర్ట్ నోటిఫికేషన్‌ను అందుకుంటారు. ఈ అలర్ట్ గట్టిగా శబ్దం లేదా వైబ్రేషన్‌తో రావచ్చు. ఇది అలర్ట్ వ్యవస్థ సమర్థతను పరీక్షించేందుకు పంపే సందేశం మాత్రమే. ఎలాంటి అత్యవసర పరిస్థితి లేదు. ఈ అలర్ట్ అందుకున్నప్పుడు ప్రజలు ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ కార్యక్రమం ఉద్దేశ్యం అత్యవసర పరిస్థితుల్లో ముఖ్యమైన సమాచారాన్ని వేగంగా ప్రజలకు చేరవేయడానికి అత్యవసర కమ్యూనికేషన్ వ్యవస్థలను బలోపేతం చేయడం. ప్రజలు ఈ టెస్ట్ అలర్ట్ అందుకున్నప్పుడు భయపడనవసరం లేదు. గందరగోళానికి గురికాకుండా ఉండేందుకు ఈ ప్రణాళికాబద్ధమైన పరీక్ష గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులకు తెలియజేయవలసిందిగా తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన, ఎమర్జెన్సీ సివిల్ డిఫెన్స్ శాఖ కోరింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





