– రూ.200 కోట్లు కేటాయిస్తూ జీవో జారీ
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 27 : ఆటో డ్రైవర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రయోజనం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్, డీజిల్‌తో నడిచే ఆటోరిక్షాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు ’తెలంగాణ ఆటోరిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్-2026’ను అమలు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే ఈ పథకం అమలుకు సిఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రి ఆటోలుగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ఇందుకోసం ఏకంగా రూ.200 కోట్ల బడ్జెట్‌ను కేటాయిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఇంధన ధరలు, వాహన నిర్వహణ ఖర్చులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆటో డ్రైవర్లకు ఈ పథకం కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది. ఈ పథకం ద్వారా సంప్రదాయ ఇంధన వాహనాల స్థానంలో ఎలక్ట్రిక్ ఆటోల వినియోగం పెరగనుంది. పెట్రోల్, డీజిల్ కోసం రోజూ అయ్యే ఖర్చుతో పోలిస్తే ఎలక్ట్రి వాహనాల నిర్వహణ వ్యయం తగ్గే అవకాశం ఉండటంతో ఆటో డ్రైవర్లకు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూరనుంది. రూ.200 కోట్ల నిధులతో 18,766 ఆటోలను ఇవిలుగా మార్చే పక్రియను ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం మా Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్ డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి . మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు





